ఇంక్రెడిబుల్ లీడర్.. కేటీఆర్ కు మహేష్ బర్త్ డే విషెస్!

mahesh babu birthday wishes to telangana it minister ktr
Highlights

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయనకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'మంచి మిత్రుడు, ఇంక్రెడిబుల్ లీడర్, మానవతావాది కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖమంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) తన పాలనతో రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. యూత్ మొత్తం కూడా కేటీఆర్ తో ట్విట్టర్ ద్వారా టచ్ లో ఉంటుంది. ఎలాంటి ఆపద వచ్చినా.. ముందుగా ఆయనకు ట్విట్టర్ లోనే మెసేజ్ లు చేస్తుంటారు.

డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్న ఈ నాయకుడు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆయనకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'మంచి మిత్రుడు, ఇంక్రెడిబుల్ లీడర్, మానవతావాది కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. మహేష్ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

మహేష్, కేటీఆర్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. మహేష్ సినిమాలకు సంబంధించి ఆయనకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు కేటీఆర్. మహేష్ నటించే ప్రతి సినిమాను ఆయన తప్పకుండా చూస్తుంటారు. ఇక కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానులు, టీఆర్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఆదివారం నుండి జ్వరంతో బాధ పడుతున్న కేటీఆర్ ఈ పుట్టినరోజు నాడు ఎవరినీ కలవలేకపోతున్నట్లు తెలిపారు. 

loader