Asianet News TeluguAsianet News Telugu

వెకేషన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో అడుగు పెట్టిన మహేష్ బాబు, వైరల్ అవుతున్న వీడియో

ఎట్టకేలకు ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ చేరాడు సూపర్ స్టార్ మహేష్. వెకేషన్ కోసం ఫారెన్ వెళ్ళిన సూపర్ స్టార్.. అక్కడ సెలబ్రేషన్స్ ను కంప్లీట్ చేసుకుని హోమ్ సిటీలో అడుగు పెట్టారు. 
 

Mahesh Babu and his family reached Hyderabad after the vacation
Author
First Published Jan 7, 2023, 7:04 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ చేరుకున్నారు. క్రిస్ మస్ తో పాటు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళారు మహేష్ బాబు. అక్కడ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మహేష్ అండ్ ఫ్యామిలీ.మహేష్ ఫ్యామిలీ గతకొద్ది రోజులుగా తమ బంధువులతో కలిసి లండన్‌లో సందడి చేశారు.. నమ్రత  సోదరి  శిల్పాశిరోద్కర్, ఆమె కుటంబ సభ్యులు అంతా కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాదు ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ న్యూ ఇయర్ విషెష్ కూడా తెలిపారు నమ్రత..

అంతే కాదు రీసెంట్ గా కొన్ని పోటోలు నెట్టింట పంచుకున్న  నమ్రత... వెకేషన్ కంప్లీట్ అయినట్టు హింట్ కూడా ఇచ్చారు. ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుకున్నట్టుగానే  వెకేషన్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు సూపర్ స్టార్ ఫ్యామిలీ. 

 

వెకేషన్ ముగించుకుని మహేష్ ఫ్యామిలీ హైదరాబాద్ చేరుకున్నారు.. ఎయిర్‌పోర్టులో మహేష్ బాబుతో పాటుగా..నమ్రత శిరోద్కర్ వారి  పిల్లలు సితార, గౌతమ్  లాండ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక హైదరాబాద్ చేరిన మహేష్ బాబు నెక్ట్స్ తన సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టనున్నారు. లాంగ్ షెడ్యూల్ లో పనిచేసిసినిమాను కంప్లీట్ చేస్తారని సమాచారం. 

ఏడాదిలో నాలుగైదు సార్లు ఫ్యామిలీతో వెకేషన్లకు వెళ్తుంటాడు మహేష్. సినిమా షూటింగ్స్.. అవి తప్పిస్తే ఫ్యామిలీ.. టూర్లు. ఈ రెండింటితో ఆయన కాలక్షేపం.. ఇవి తప్పించి ఫ్రెండ్స్ పార్టీలంటూ తిరగడం సూపర్ స్టార్ కు అలవాటు లేదు. భార్య నమ్రతతో పాటు పిల్లలు సితార, గౌతమ్ లతో టైమ్ స్పెండ్ చేస్తూ.. ఆ అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు సూపర్ స్టార్. 

త్రివిక్రమ్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది..ఈ మూవీ కోసం మహేష్ బాబు నాన్ స్టాప్ గా పనిచేయాలి అని నిర్ణయించుకున్నారని సమాచారం. దాదాపు  60 రోజుల కోసం కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్ టీమ్. సంక్రాంతి తరువాత రంగంలోకి దిగబోతున్నాడు సూపర్ స్టార్. సమ్మర్ వరకూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈ ఏడాది మిడ్ వరకూ సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు టీమ్. ఈమూవీ తరువాత రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు మహేష్ బాబు. 

Follow Us:
Download App:
  • android
  • ios