మహేష్, రకుల్ జంటగా స్పైడర్ దసరా కానుక గా ప్రేక్షకుల ముందుకు స్పైడర్ సెన్సార్ పూర్తి చేసుకున్న స్పైడర్
మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా ‘ స్పైడర్’. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించారు. దసరా కానుకగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ స్పైడర్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
As per Censor Board Members, #SPYder has no Dull Moment throughout the film ! A full on Racy Screenplay ! @urstrulyMahesh looking Terrific 👍 pic.twitter.com/mYmPihP2Zi
సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే.. చాలా బాగుందని చెబుతున్నారు. సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఒకరైన ఉమైర్ సాంధు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. 2గంటల 25 నిమిషాల నిడివిగల ఈ చిత్రంలో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టించలేదట. సినిమా మొదటి సీన్ నుంచి చివర సీన్ వరకు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని ఆయన చెప్పాడు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీ మహేష్ పెర్ఫామెన్స్ ఔట్‌స్టాండింగ్, టెర్రిఫిక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తోందని అభిమానులతోపాటు.. దర్శక నిర్మాతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.
