స్పైడర్ టీజర్ కి విశేష స్పందన భారీగా హైప్ క్రియేట్ చేస్తున్న స్పైడర్ అంచనాలకు మించి అమ్ముడు పోయిన స్పైడర్ కర్ణాటక హక్కులు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు తెరకెక్కిస్తున్న స్పైడర్ మూవీ ప్రస్థుతం ఫైనల్ సాంగ్ షూటింగ్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా వున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ మహేష్, మురుగదాస్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ బిజినెస్ పరంగా మంచి రేంజ్ లో దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ మూవీ కర్ణాటక హక్కులను 10.8కోట్ల రూపాయలకు గోల్డీ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది.ఇది నిజంగా శుభపరిణామమే.
కర్ణాటక హక్కుల కోసం ఈ రేంజ్ లో డిమాండ్ వుందంటే స్పైడర్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న స్పైడర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
