సంక్రాంతిని మిస్ చేస్తున్నాడే!

mahesh 25th movie release date
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. #MB25 గా పిలుచుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నట్లు వార్తలువినిపించాయి. కానీ చిత్రబృందం మాత్రం ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

సంక్రాంతి పోరులో నిలుస్తాడనుకున్న మహేష్ కాస్త ఇప్పుడు మూడు నెలలు ఆలస్యంగా విడుదల కానుండడంతో జనవరి నెలలో మరిన్ని సినిమాలు ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. సినిమాలో నరేష్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు. ఈ సినిమా కథ రైతు ఆత్మహత్యల చుట్టూ తిరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు సంపన్నుడి పాత్రలో కనిపిస్తాడని, నరేష్ నిరుపేద యువకుడిగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి స్నేహం నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఈ నెల 10 వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.   

loader