మహానటి సావిత్రి చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్న కీర్తి సురేష్ కీీర్తి సురేష్ సావిత్రి లుక్ అంటూ ఇటీవల హల్చల్ చేస్తున్న ఫోటో అది మహానటి లుక్ కాదని, ఓ కంపెనీ యాడ్ షూట్ అని స్పష్టంచేసిన కీర్తి
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెెరకెక్కుతున్న మూవీ ‘మహానటి’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ఇలా కనిపించబోతున్నారంటూ కొన్ని ఫొటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారంపై కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చారు.
అది చెన్నై సిల్క్స్ కమర్షియల్ యాడ్ కోసం తీసిన ఫొటో అని, త్వరలోనే ‘మహానటి’ లుక్ వస్తుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేశారు. కాగా.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ నిర్మిస్తున్నారు.
ఇక ‘మహానటి’ తారాగణం విషయానికి వస్తే.. సినిమాలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే మలయాళ స్టార్ హీరో, మమ్ముట్టి కుమారడు దుల్కర్ సల్మాన్ సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, షాలిని పాండే, ప్రగ్యా జైస్వాల్, భానుప్రియ, రాజేంద్రప్రసాద్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కూడా ‘మహానటి’ ప్రాజెక్టులో చేరినట్లు సమాచారం. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
అలనాటి నటి సావిత్రి గురించి తెలియనివారుండరు. దేశం గర్వించదగిన నటీమణుల్లో ఆమె ఒకరు. అందం, అభినయంతో ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగిన నటిగా ఎంతో కీర్తిని గడించారు. ఇప్పుడు ఆమె జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ఇలా కనిపించబోతున్నారంటూ కొన్ని ఫొటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారంపై కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చారు. అది చెన్నై సిల్క్స్ కమర్షియల్ యాడ్ కోసం తీసిన ఫొటో అని, త్వరలోనే ‘మహానటి’ లుక్ వస్తుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేశారు.
ఇక.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఇక ‘మహానటి’ తారాగణం విషయానికి వస్తే.. సినిమాలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే మలయాళ స్టార్ హీరో, మమ్ముట్టి కుమారడు దుల్కర్ సల్మాన్ సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, షాలిని పాండే, ప్రగ్యా జైస్వాల్, భానుప్రియ, రాజేంద్రప్రసాద్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కూడా ‘మహానటి’ ప్రాజెక్టులో చేరినట్లు సమాచారం. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు
