MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Top Heroine: హీరోయిన్లలో ఆమె తోపు.. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు.. సోషల్ మీడియాను ఏలుతున్న బ్యూటీ ఎవరు?

Top Heroine: హీరోయిన్లలో ఆమె తోపు.. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు.. సోషల్ మీడియాను ఏలుతున్న బ్యూటీ ఎవరు?

Top Heroine: ప్రస్తుతం హీరోయిన్లకు పెద్ద సినిమాలు, సక్సెస్ లు, అభిమానులతో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా తప్పనిసరి అయ్యింది. నెట్టింట్లో ఎంత ఫాలోయింగ్ ఉంటే.. ఆమె అంత తోపు హీరోయిన్.. ప్రస్తుతం ఇన్ స్టాలో టాప్ లో ఉన్న తార ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 24 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇన్ స్టాగ్రామ్ లో టాప్ హీరోయిన్ ఎవరు?
Image Credit : Asianet News

ఇన్ స్టాగ్రామ్ లో టాప్ హీరోయిన్ ఎవరు?

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎంత స్టార్ డమ్ ఉన్నా.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకపోతే.. పాపులారిటీని నిలబెట్టుకోలేకపోతున్నారు. నెట్టింట్లో ఎప్పటికప్పుడు తమను తాము నిరూపించుకుంటూ.. ఫాలోవర్స్ లో టాప్ లో ఉంటేనే లైమ్ లైట్ లో ఉంటారు. కొంత హీరోయిన్లు సినిమాల పరంగా అవకాశాలు లేకపోయినా, స్టార్ డమ్ లేకపోయినా.. ఇన్ స్టాలో మాత్రం మహారాణుల్లా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో టాప్ లో ఉన్న హీరోయిన్ ఎవరు? ఆమె సినిమాలు, ఆస్తులు, ఫాలోవర్ల వివరాలు ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాన్ ఇండియా స్టార్ గా శ్రద్ధా కపూర్
Image Credit : instagram

పాన్ ఇండియా స్టార్ గా శ్రద్ధా కపూర్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది నటి శ్రద్ధా కపూర్. 'ఆషికి 2', 'సాహో', 'స్త్రీ' వంటి వరుస హిట్ చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్న శ్రద్ధా కపూర్, కేవలం నటనలోనే కాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఇండియన్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఈ హీరోయిన్ సినిమాలు, స్టార్ డమ్ కంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ లో టాప్ అనిపించుకుంటుంది. స్టార్ డమ్ తో వెలిగిపోతున్న ఇతర హీరోయిన్ల కంటే నెట్టింట తానే తోపు అని నిరూపించుకుంది.

Related Articles

Related image1
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Related image2
Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
35
సోషల్ మీడియా క్రేజ్ - బ్రాండ్ వాల్యూ
Image Credit : instagram

సోషల్ మీడియా క్రేజ్ - బ్రాండ్ వాల్యూ

సోషల్ మీడియాలో శ్రద్ధా కపూర్ సాధిస్తున్న పాపులారిటీ ఆమెను ఇతర టాప్ హీరోయిన్ల కంటే ముందు వరుసలో నిలబెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 కోట్లకు పైగా ఫాలోవర్లతో ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ వంటి టాప్ స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి అత్యధికంగా ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచారు. ఈ క్రేజ్ కారణంగానే ఆమెను పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్‌లు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నాయి.

45
భారీ రెమ్యునరేషన్ - నెట్ వర్త్
Image Credit : instagram

భారీ రెమ్యునరేషన్ - నెట్ వర్త్

సినీ వర్గాల సమాచారం ప్రకారం, శ్రద్ధా కపూర్ ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, మోడలింగ్, పెట్టుబడుల ద్వారా ఆమె ఆదాయం మరింత భారీగా పెరిగింది. మీడియా రిపోర్ట్ ల ప్రకారం, ఆమె నికర ఆస్తి విలువ (Net Worth) ప్రస్తుతం సుమారు రూ. 123 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఒక బ్రాండ్ ప్రకటన కోసం ఆమె దాదాపు రూ. 1.6 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

55
లగ్జరీ లైఫ్ స్టైల్.. కార్ కలెక్షన్స్
Image Credit : Social Media

లగ్జరీ లైఫ్ స్టైల్.. కార్ కలెక్షన్స్

ముంబైలోని జుహు ప్రాంతంలో సీ ఫేసింగ్ లో ఆమెకు అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఉంది. ఆ ఇంటి విలువ 60 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక శ్రద్దా గ్యారేజ్ లో లంబోర్గిని హురకాన్, ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది.వరుస హిట్లు సాధిస్తూనే, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపార పెట్టుబడులలో విజయవంతంగా రాణిస్తూ సినీ పరిశ్రమలో అత్యంత బలమైన హీరోయిన్ గా వెలిగిపోతోంది శ్రద్దా కపూర్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Recommended image2
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Recommended image3
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Related Stories
Recommended image1
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved