MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Lenin 14 Days Collections: అఖిల్‌ ఇంకా సమంతని దాటలేదా? లెనిన్‌ 14 రోజుల్లో రాబట్టిన కలెక్షన్లు ఇవే

Lenin 14 Days Collections: అఖిల్‌ ఇంకా సమంతని దాటలేదా? లెనిన్‌ 14 రోజుల్లో రాబట్టిన కలెక్షన్లు ఇవే

అక్కినేని అఖిల్‌కి ఎట్టకేలకు `లెనిన్‌`తో ఫస్ట్ హిట్‌ అందుకున్నాడు. ఈ మూవీ విడుదలై 14 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందనేది చూస్తే, ఈ మూవీ ఇంకా సమంత సినిమాని దాటలేదని టాక్‌.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 24 2026, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లెనిన్‌ కలెక్షన్లు
Image Credit : X/@AnnapurnaStdios

లెనిన్‌ కలెక్షన్లు

అఖిల్‌ అక్కినేని దాదాపు 11ఏళ్ల పోరాటం తర్వాత తొలి విజయాన్ని అందుకున్నాడు. అందుకు ఏడు సినిమాలు చేయాల్సి వచ్చింది. `లెనిన్‌`తో ఆయన బ్లాక్ బస్టర్‌ని అందుకున్న విషయం తెలిసిందే. మరళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ నిర్మించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ప్రమోద్‌, శివాజీ, ఈశ్వరీరావు, రాంకీ, గెటప్‌ శ్రీను వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జులై 10న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది. ఎంత లాభాలు వచ్చాయనేది చూస్తే,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లెనిన్‌ మూవీ 14 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@AnnapurnaStdios

లెనిన్‌ మూవీ 14 రోజుల కలెక్షన్లు

`లెనిన్‌` మూవీ విడుదలై గురువారంతో 14 రోజులు పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌లోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని టీమ్‌ చెప్పింది. మరి ఇప్పటి వరకు ఎంత రాబట్టిందనే లెక్కలు పరిశీలిస్తే, ఈ మూవీ సాలిడ్‌గానే వసూలు చేసింది. ఇంకా స్ట్రాంగ్‌గా కలెక్ట్ చేస్తోంది. ట్రేడ్‌ సైట్ల లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ.69కోట్లు రాబట్టింది. సుమారుగా రూ.35కోట్ల షేర్‌ని సాధించింది. గురువారం ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కోటి వరకు కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. ఇండియాలో డెబ్బై లక్షలు రావడం విశేషం. జన నాయగన్‌ తో పోటీ ఉన్నా, ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టడం మరో విశేషం.

Related Articles

Related image1
Lenin Team Remunerations: లెనిన్‌ మూవీకి అఖిల్‌ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు
Related image2
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
34
లెనిన్‌ మూవీ లాభాలు
Image Credit : Asianet News

లెనిన్‌ మూవీ లాభాలు

ఇక నిర్మాతలు ప్రకటించిన లెక్కన ప్రకారం ఈ సినిమా ఇప్పటికే రూ.90కోట్లు దాటింది. అయితే ఈ శుక్రవారం నుంచి కలెక్షన్లు బాగానే పడిపోతాయి. ఓ వైపు జన నాయకుడు, మరోవైపు చెన్నై లవ్‌ స్టోరీ సినిమాలు ఉండటంతో థియేటర్లు తగ్గుతాయి. దీంతో ఆటోమెటిక్‌గా కలెక్షన్లు తగ్గుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.22కోట్లు. ఇప్పటికే ఆ లెక్కలు దాటేసింది. సుమారు రూ.15కోట్ల లాభాల్లో ఉంది. లాంగ్‌ రన్‌లో మరో నాలుగైదు కోట్లు చేసే అవకాశం ఉంది. అంటే `లెనిన్‌` సినిమా ద్వారా నిర్మాతలకు సుమారు ఇరవై కోట్ల లాభాలు వస్తాయని చెప్పొచ్చు.

44
ఇంకా సమంతని టచ్‌ చేయని అఖిల్‌
Image Credit : Asianet News

ఇంకా సమంతని టచ్‌ చేయని అఖిల్‌

ఇదిలా ఉంటే `లెనిన్‌` మూవీకి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చినా, ప్రారంభంలో కలెక్షన్ల పరంగా జోరు చూపించినా ఇది ఇంకా అఖిల్‌ మాజీ వదిన, ఆయన స్నేహితురాలు సమంత మూవీని దాటలేకపోయింది. సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ బాక్సాఫీసు వద్ద వంద కోట్లకుపై వసూళ్లని రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమాని అఖిల్‌ `లెనిన్‌` దాటలేకపోయింది. లాంగ్‌ రన్‌లో దాన్ని దాటేస్తుందా అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image3
OTT: ఒకే ఓటీటీలో బాలయ్య, వెంకటేష్‌, నాగచైతన్య సినిమాలు.. జీ5లో ఇక వరసగా జాతరే
Related Stories
Recommended image1
Lenin Team Remunerations: లెనిన్‌ మూవీకి అఖిల్‌ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు
Recommended image2
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved