నైజాంలో 'మహానటి' హవా!

mahanati movie nizam area collections
Highlights

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహానటి' సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మహానటి' సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యునానిమస్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా వసూళ్ళ పరంగా కూడా సత్తా చాటుతోంది. ఒక నైజాం ఏరియాలో ఈ సినిమాలో దాదాపు 2.6 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిందని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు థియేటర్ లో ఉండగానే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు కావడం విశేషమనే చెప్పాలి.

ఫుల్ రన్ లో నైజాంలో ఈ సినిమా 10 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ లో 1.3 మిలియన్ రికార్డు కలెక్షన్స్ సాధించింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ నటించగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. 

loader