మహానటి డిలీటెడ్ సీన్స్: ఈ సీన్స్ ఉంటే అదిరిపోయేద్ది

Mahanati deleted scenes released
Highlights

మహానటి డిలీటెడ్ సీన్స్: ఈ సీన్స్ ఉంటే అదిరిపోయేద్ది

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సావిత్రిగా నటించిన కీర్తి సురేష్‌ నటనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలనాటి అందాల నటి మళ్లీ వచ్చిందా అన్నట్టుగా తన హావభావాలతో ప్రేక్షకుల్ని మైమరించింది కీర్తి సురేష్. యువ దర్శక సంచలనం నాగ్ అశ్విన్ ప్రతిభకు అద్దం పట్టేదిగా ఉంది ఈ చిత్రం. ఈ మూవీలో నటించిన సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, క్రిష్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు, షాలినీ పాండేలు తమ పాత్రలకు జీవం పోయడంతో ‘మహానటి’ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. 

‘మహానటి’ చిత్రం దాదాపు 3 గంటల నిడివితో విడుదల చేశారు. అయితే నిడివి మరీ ఎక్కువగా ఉండటంతో చాలా వరకూ సీన్స్ కట్ చేశారు. ఆ కట్ చేసిన సీన్స్‌ను వరుసగా విడుదల చేస్తున్నారు. తాజాగా ‘మాయాబజార్’ చిత్రంలో శశిరేఖ పాత్రలో సావిత్రి చేసిన అల్లరిని ఆవిష్కరిస్తూ.. ఆ పాత్రలో కీర్తి సురేష్ అభినయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే సీన్‌ను విడుదల చేశారు. 

ఈ సీన్‌లో కీర్తి సురేష్.. మాయా బజార్ ప్రియదర్శిని పేటిక ముందు నటించడానికి సిద్ధంగా ఉన్న సన్నివేశంలో.. ‘ఇలాంటిది నిజంగానే ఉంటే చాలా బావుండేది. వేరే షూటింగ్‌లో ఉన్న మా ఆయనతో మాట్లాడుకోవచ్చు అని కీర్తి సురేష్ అనడం... చిత్ర దర్శకుడు కెవి రెడ్డి పాత్రలో ఉన్న క్రిష్.. ఇప్పుడు నాగేశ్వరరావుతో మాట్లాడు చాలు అని సీరియస్‌గా చమత్కరించడం నవ్వులు పూయిస్తుంది. అద్భుతంగా ఉన్న ఈ సీన్ సినిమాలో ఉంటే బాగుండే అని ‘మాయా బజార్’‌లో సావిత్రి చిలిపి అల్లరిని మళ్లీ చూసేవాళ్లం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. 

                              

loader