'విశ్వరూపం-2' పై కేసు.. విడుదలపై నిషేధం కోరుతూ పిటిషన్!

Madras high court notice on plea to halt Vishwaroopam 2
Highlights

కమల్ హాసన్ తన బ్యానర్ లో 'మర్మయోగి' అనే సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని చిత్రనిర్మాణానికి రూ.6.90 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, కమల్ హాసన్ కు అడ్వాన్స్ గా రూ.4 కోట్లు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం-2' సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైంది. ఆగస్టు 10న సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పడు ఈ సినిమా విడుదలపై నిషేధం కోరుతూ సాయిమీరా చిత్ర నిర్మాణ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కమల్ హాసన్ తన బ్యానర్ లో 'మర్మయోగి' అనే సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని చిత్రనిర్మాణానికి రూ.6.90 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, కమల్ హాసన్ కు అడ్వాన్స్ గా రూ.4 కోట్లు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ సినిమా పూర్తి చేయకుండా ఆ డబ్బుతో 'ఉన్నైపోల్ ఒరువన్' సినిమాను పూర్తి చేసుకున్నారని ఆరోపించారు. దీంతో తమ డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమ డబ్బు చెల్లించే వరకు సినిమాను విడుదల చేయకుండా నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు రాగా కమల్ తరఫు న్యాయవాది రిట్ పిటిషన్ కు గడువు కోరారు. న్యాయమూర్తి కమల్ కి, ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థలకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. 

loader