ఆ హీరోని కౌగిలించుకొని ఏడ్చేశా: మడోనా

madonna sebastian about lip lock scenes
Highlights

మొదటి సినిమాలో హీరోని కౌగిలించుకుని సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు అతడిని కౌగిలించుకున్న తరువాత ఆ సీన్ చేసినందుకు ఏడుపొచ్చిందని వెల్లడించింది. అదే విషయాన్ని తన తల్లికి చెప్పి ఏడ్చేశానని స్పష్టం చేసింది

మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మడోనా సెబాస్టియన్ తెలుగులో కూడా ఆ సినిమా రీమేక్ లో నటించి తెలుగు వారికి దగ్గరైంది. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా గడుపుతోన్న ఈ నటి సినిమాలో రొమాంటిక్ సీన్లలో మాత్రం నటించలేనని తేల్చి చెబుతోంది. ఆ కారణంగానే మూడు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు కోల్పోయానని చెబుతోంది. సినిమాల్లో హీరోయిన్లు రొమాంటిక్ సీన్లలో నటించడం కామన్. కొందరు తారలు లిప్ లాక్ వంటి సన్నివేశాలుంటే రెమ్యునరేషన్ మరింత ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు.

కొందరు హీరోయిన్లు మాత్రం లిప్ లాక్, రొమాంటిక్ సన్నివేశాలలో నటించమని ముందే చెప్పేస్తుంటారు. ఈ విషయంలో నార్త్ భామలతో పోలిస్తే సౌత్ భామల లిస్ట్ కాస్త పెద్దదిగానే ఉంటుంది. ఇప్పుడు మడోనా కూడా ఆ లిస్ట్ లో చేరింది. తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని నేరుగా చెప్పేసింది. మొదటి సినిమాలో హీరోని కౌగిలించుకుని సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు అతడిని కౌగిలించుకున్న తరువాత ఆ సీన్ చేసినందుకు ఏడుపొచ్చిందని వెల్లడించింది. అదే విషయాన్ని తన తల్లికి చెప్పి ఏడ్చేశానని స్పష్టం చేసింది.

అబ్బాయిలతో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడతానని తనకు సిగ్గు కూడా ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే లిప్ లాక్ సీన్లు చేయనని మూడు సినిమాలు వదులుకుంది. మరి ఇలానే లిమిట్స్ పెట్టుకొని హీరోయిన్ గా కంటిన్యూ  అవ్వాలంటే భవిష్యత్తులో కష్టమేనని కొందరు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.   

loader