తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితంపై సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించిన మధుర శ్రీధర్ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును కేసీఆర్ గా ఎంచుకున్న మధుర శ్రీధర్ మధుర శ్రీధర్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి

సిఎం కెసిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కెసిఆర్ పాత్రలో నటించేది ఏవరు అనే దానిపై ఇన్నాళ్లు సస్పెన్స్‌న్ నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ చిత్ర దర్శక నిర్మాతలు కెసిఆర్‌కు పాత్రకు బాలీవుడు యువ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మధుర శ్రీధర్ డైరెక్షన్‌లో పెళ్లిచూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ మూవీలో కెసిఆర్‌గా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నాడట. ఈ విషయాన్ని నిర్మాత రాజ్ తెలిపారు. కెసిఆర్ బాల్యం నుంచి రాజకీయ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆయన పోషించిన పాత్రతో పాటు ప్రస్తుతం సిఎంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానాన్ని ఈ సినిమాలో చూపించన్నున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని దర్శకుడు మధుర శ్రీధర్ తెలిపారు. 2018, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మూవీని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది.