ఈ మధ్య సోషల్ మీడియాలో తారలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్ ఫామ్స్ పై.. లైవ్ చాట్లు చేయడం సాధారణంగా జరిగేదే. పబ్లిక్‌గా జరిగే ఈ చాట్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు వచ్చి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. అందులో కొన్ని కామెంట్స్ అభ్యంతరకరంగా ఉంటాయి. ఇటీవల అభిమానులతో ఫేస్‌బుక్ చాట్లో పాల్గొన్న హీరోయిన్ మాధవి లతకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆ కామెంట్లను లైట్ తీసుకోకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

 

మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటూ....అభిమాని అడిగిన ప్రశ్నకు మాధవి లత సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో కొందరు ఆమెపై కామెంట్ల దాడి ప్రారంభించారు. ‘ఇక్కడ కూడా పవన్ భజనే... అందుకే మిమ్మల్ని బత్తాయిలు అనేది' అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయడంతో దీనికి మాధవి లత తనదైన రీతిలో రిప్లై ఇచ్చారు. ‘బత్తాయిలు అదీ ఇదీ లేదండీ... నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా మాట్లాడింది కాదు, నాకు ప్రతి సారి మీకు ఇష్టమైన హీరో ఎవరు? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ టాపిక్ చాలా రోటీన్ గా, రెగ్యులర్ గా వస్తోంది. నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ కాబట్టే వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెబుతున్నాను. అంతే కాని ఇది పవన్ కళ్యాణ్ భజన ఎంత మాత్రం కాదు' అని మాధవి లత స్పష్టం చేశారు.

 

హీరోన్ కావాలనేదిది నా డ్రీమ్. ఒక సాధారణ తెలుగు ఫ్యామిలీ నుండి వచ్చి మా పేరెంట్స్ ను ఒప్పించుకుని... సినిమా ఇండస్ట్రీకి రీచ్ అవ్వడం, హీరోయిన్ అవ్వడం అనేది నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ తోనే సాధ్యం అయింది అని ఓ ప్రశ్నకు మాధవి లత సమాధానం ఇచ్చారు. మాధవి లత చెబుతున్న సమాధానాలకు ‘ఒసేయ్ ఆపే నీ సోది...' అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టడంతో మాధవి లత ఫైర్ అయ్యారు.

‘అసలు మీకు కల్చర్ లేదు. మీరు కల్చర్డ్ గా మాట్లాడితే నేను కల్చర్డ్ గా మాట్లాడతాను. మీరు ఎడ్యుకేటెడ్ అయుండి ఒక పబ్లిక్ సైట్లోకి వచ్చి ఒక అమ్మాయిని పట్టుకుని ఒసేయ్, అదీ, ఇదీ అనడం కరెక్ట్ కాదు బ్రదర్...' అంటూ మండి పడ్డారు.

 

ఓ కామెంటుకు మాధవి లత సమాధానం ఇస్తూ.... ‘నాకు ఎన్టీఆర్‌తో పాటు అందరు హీరోలు ఇష్టం. నాకు ఇష్టం లేని వారే లేరు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, పెర్ఫార్మెన్స్ బావుంటుంది. ఎన్టీఆర్ సినిమాలు చూడను అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడూ ఎవరినీ కించ పరిచిన సందర్భాలు కూడా లేవు. ఎవరి లైఫ్ స్టైల్ వారిది, ఎవరి ఇష్టాఇష్టాలు వారివి... అని మాధవి లత తెలిపారు.

 

తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్లుకు.. ‘ముందు కల్చర్ నేర్చుకో బ్రదర్. ఒక అమ్మాయితో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. నన్ను కామెంట్స్ చేస్తుపుడు మీరు సంస్కారంగా పెరగలేదనే అర్థం.' అని మాధవి లత చెప్పుకొచ్చారు.