నచ్చావులే’తో కథానాయికగా పరిచయమైన మాధవీలత ఎప్పుడో లైమ్ లైట్లోంచి వెళ్లిపోయింది. ఐతే ఈ మధ్య ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాధవీలత మరోసారి ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయింది. 

80 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఇలాంటి డార్క్ సీక్రెట్స్ నడుస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిని కూకటి వెళ్లతో సహ పీకేయడం జరగవు. అవి ప్రతి చోట ఉన్నవే. ప్రైవేట్ సెక్టార్లో లెవా - గవర్నమెంట్ సెక్టర్లో లెవా.. ఇది ఓపెన్ గా ఉండే ఇండస్ట్రీ కాబట్టే ఇవి బయటికి వస్తున్నాయి. ఎం మీడియా వాళ్లకు తెలియదా ఈ సీక్రెట్లు? వెళ్లేందుకు బయటపెట్టట్లేదు. సెలెబ్రెటీలను బయటకు లాగి మరీ ఎందుకు వేస్తారు ఈ ప్రశ్నలు?" అంటూ అడిగింది. "ఇంత గ్లామరస్ ఫీల్డ్ లో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని చూస్తే అబ్బాయిల మనసు చలిస్తుంది. ఇన్నికోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు నువ్వు నాకు కమిట్ అవుతావు అని అడుగుతారు. కమిట్ అవుతావు లేదా నీ ఇష్టం. కమిట్ అయితేనే సినిమాలు అని అన్ని సందర్భాల్లో మనం చెప్పలేం. తొంభై శాతం ఉంది. ఆ మిగిలిన 10 శాతం మంది అవకాశం రాక మంచివాళ్ళుగా మిగిలిపోతారు" అంటూ చెప్పుకొచ్చింది మాధవి.