నచ్చావులే’తో కథానాయికగా పరిచయమైన మాధవీలత ఎప్పుడో లైమ్ లైట్లోంచి వెళ్లిపోయింది. ఐతే ఈ మధ్య ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలతో ఆమె వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాధవీలత మరోసారి ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయింది. 


‘నచ్చావులే’ కంటే ముందు తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు ఓ కోఆర్డినేటర్ ఫోన్ చేసి.. సినిమా అవకాశం ఉందని చెప్పాడని.. కానీ దాని కంటే ముందు తామిద్దరం ప్రేవేట్ గా బయటకు వెళ్దామని అడిగాడని మాధవీలత చెప్పింది. ఇలా వెళ్లి మనం ఒక రాత్రి గడిపితే బాండింగ్ పెరుగుతుందని.. తర్వాత నీ ఫిగర్ గురించి నిర్మాతకు వర్ణిస్తానని.. అలా సినిమాలో నటించే అవకాశం లభిస్తుందని అతను అన్నట్లు మాధవీలత వెల్లడించింది. అతడి ఉద్దేశం తనకు అర్థమై తన ఫోన్ మళ్లీ లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపింది. తర్వాత మరో వ్యక్తి తనకు ఫోన్ చేసి రాత్రికి ఫ్రీనా అడిగాడని.. చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించానని.. పోలీస్ కంప్లైంట్ చేస్తాననడంతో ఫోన్ పెట్టేశాడని మాధవి చెప్పింది. మరో సందర్భంలో ఒక నిర్మాత ఫోన్ చేసి కమిట్మెంట్ ఇస్తావా అని అడిగాడని.. తాను కుదరదు అన్నానని.. సినిమా అవకాశం అడిగినపుడు ఇలాంటివి కామనే కదా అని ఆ నిర్మాత అన్నాడని.. కానీ తాను ఒప్పుకోలేదని ఆమె తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో తాను మరీ పెద్ద గొడవేమీ చేయలేదని ఆమె అంది. తనను ఇలా అడిగిన నిర్మాత పేరు చెబితే.. మిగతా నిర్మాతలు అతడిని నిందిస్తారని.. ఆ నిర్మాతను నమ్ముకున్న వాళ్లు ఇబ్బంది పడతారని.. నిజానికి ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి వాళ్లే ఉన్నారని ఆమె అంది. ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ శరీరాన్నిఅర్పించుకునే పద్ధతి ఆగదన్న మాధవి.. కొందరు విధిలేక ఇలా చేస్తుంటే.. ఇంకొందరు అవకాశాల కోసం శరీరాల్ని లంచంగా సమర్పించుకుంటున్నారని ఆమె అంది.