గిల్లితే గిల్లిచ్చుకోవాలా... మాకు ఫీలింగ్స్ ఉండవా.? : మాధవిలత

Madhavi latha on her political entry
Highlights

గిల్లితే గిల్లిచ్చుకోవాలా... మాకు ఫీలింగ్స్ ఉండవా.? : మాధవిలత

తెలుగు ఇండస్ర్టీ లో అమ్మాయిలకు వేధింపులు కామన్. ఇక్కడ హీరోల డామినేషన్ ఎక్కువ వాళ్లని తట్టుకోవడం చాలా కష్టం. సినీ ఇండస్ట్రీలో మహిళలకు పెద్దపీట వేయాలన్నది నా కోరిక, అందునా తెలుగమ్మాయిలు ఎక్కువగా రావాలి. అసలు ఇండస్ర్టీలో క్యాస్టింగ్ లేకుండా చేయడమే నా ధ్యేయం.

ఇక అసలు విషయానికి వస్తే... న‌టి మాధ‌వీల‌త త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది. తాను రాజీకాయాల్లోకి వ‌స్తున్నాన‌ని చెప్పిన వెంట‌నే.. త‌నంటే గిట్ట‌ని వాళ్లంతా చెప్ప‌కూడ‌ని ప‌దాల‌ను ఉప‌యోగిస్తూ కామెంట్లు చేశార‌ని, ఆ కామెంట్లు చూసిన త‌న‌కు చాలా బాధ‌ క‌లిగింద‌ని చెప్పుకొచ్చింది.

ఇలా బాధ‌ప‌డితే.. నీవేమీ పొలిటిక‌ల్ లీడ‌ర్ అవుతావు..? అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించార‌ని చెప్పింది. ఏం నేను మ‌నిషిని కాదా..? నాకు ఫీలింగ్స్ లేవా..? నాకు క‌న్నీళ్లు రావా..? ఇత‌రులు చ‌ద‌వ‌ని రీతిలో ప‌దాలు ఉప‌యోగిస్తూ ఆ కామెంట్స్ చేశార‌ని చెప్పింది. వారు గిల్లితే గిల్లించుకోవాల్నా..? ర‌క్తం వ‌చ్చేలా గిచ్చుతామంటారు..? ఆ త‌రువాత ఫ‌స్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకూడ‌దంటూ కామెంట్స్ పెడుతుంటారు.. వాట‌న్నిటినీ మేం భ‌రించాల్నా..? అంటూ ప్ర‌శ్నించింది మాధ‌వీ ల‌త‌.

loader