కర్ణాటక లో ఓ సినిమా షూటింగ్ సందర్బంగా అపశృతిమాస్తిగుడి సినిమా షూటింగ్‌లో ప్రమాదంతిప్ప గుండన హల్లి రిజర్వాయర్ వద్ద క్లెమాక్స్ షూటింగ్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం ఇద్దరు విలన్లు అనిల్, ఉదయ్ మృతిప్రాణాలతో బయటపడ్డ హీరో దునియా విజయ్
కర్ణాటక రాష్ట్రంలో ఓ సినిమా షూటింగ్ సందర్బంగా అపశృతి చోటుచేసుకుంది. మాస్తిగుడి సినిమా షూటింగ్లో ప్రమాదం సంభవించింది. తిప్ప గుండన హల్లి రిజర్వాయర్ వద్ద క్లెమాక్స్ షూటింగ్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విలన్లు అనిల్, ఉదయ్ మృతిచెందారు. హీరో దునియా విజయ్ ప్రాణాలతో బయటపడ్డారు. మృతదేహాలు ఇంత వరకు లభ్యం కాలేదు.
మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ సీన్ షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ చిత్రీకరణలో భాగంగా.. హీరో, విలన్లు హెలీకాప్టర్ నుంచి నీళ్లలో దూకే సీన్ చిత్రీకరిస్తున్నారు. అయితే నీళ్లలో దూకిన తర్వాత విలన్లు ఇద్దరూ.. మునిగిపోయారు. హీరో దునియా విజయ్ మాత్రం క్షేమంగా బతికి బయటపడ్డారు. కానీ విలన్లుగా నటిస్తున్న అనిల్, ఉదయ్ ఇద్దరూ.. నీళ్లలో మునిగిపోయారు. నటుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.
ఈత రాకున్నా,, రిస్కీ షాట్ చేయటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని.., పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్థుతం మృతదేేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.
సినీ అభిమానులను మెప్పించేందుకు రిస్కీ షాట్లు చేస్తూ.. ప్రమాదాల్లో గాయపడటం ఇటీవల పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కూడా ప్రస్థుతం దీని కారణంగానే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. జాగ్రత్తలన్నీ పాటించి షూటింగి చేస్తే నటీనటులకు మంచిదని అంటున్నారు.
