Asianet News TeluguAsianet News Telugu

MAA elections: ఇంకా యాభై శాతం కూడా జరగిని పోలింగ్.. ఎన్ని ఓట్లు పోలైయ్యాయంటే!

 కేవలం ఒక గంట మాత్రమే సమయం ఉండగా, యాభై శాతం పోలింగ్ కూడా జరగలేదు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే మెరుగైన రేటు నమోదు కావచ్చు. 

maa elections this is the vote percentage till now
Author
Hyderabad, First Published Oct 10, 2021, 1:16 PM IST

ఈసారి మా సభ్యులలో  చైతన్యం వచ్చింది... ఓటింగ్ శాతం పెరగబోతుందని మా అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ చెప్పినప్పటికీ ఆ సూచనలు కనిపించడం లేదు. అసోసియేషన్  మొత్తం ఓట్లు 883 అని తెలుస్తుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కేవలం  491 ఓట్లు మాత్రమే పోలైనట్లు సమాచారం  అందుతుంది. 


ఇంకా కేవలం ఒక గంట మాత్రమే సమయం ఉండగా, యాభై శాతం పోలింగ్ కూడా జరగలేదు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే మెరుగైన రేటు నమోదు కావచ్చు. గత ఎన్నికలలో ఎప్పుడూ కూడా 500 మించి ఓట్లు పోల్ కాలేదని సమాచారం. ఈసారి ఆ సంఖ్యను చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 

Also read MAA Elections: శివ బాలాజీ చేయి కొరికేసిన హేమ..
ఇక పోలింగ్ కేంద్రంలో గొడవలు జరగడం సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు ప్యానెల్ మెంబర్ గా ఉన్న శివ బాలాజీ, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న హేమ చేయికొరికిందని పిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని, తమకే ఓటు వేసేలా సభ్యులను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ప్యానెల్ మెంబర్స్ మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవలో హెమ.. శివబాలాజీ చేయి కొరికారట. 

Also read MAA elections: శతృవులు ఎన్నికల వేళ ఒక్కటయ్యారే!


హేమ కొరకడం వలన చేతికి అయిన గాయాన్ని శివబాలాజీ, నరేష్ మీడియాకు చూపించారు. సెలెబ్రిటీ హోదాలో ఉన్న నటుల మధ్య ఈ తరహా గొడవలు చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయి నుండి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి మా ఎన్నికలు చేరాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios