Asianet News TeluguAsianet News Telugu

MAA elections: శతృవులు ఎన్నికల వేళ ఒక్కటయ్యారే!

ఇరు ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రంలో ఉండి ఎన్నికల సరళి పరిశీలిస్తున్నారు. అలాగే నిన్నటి వరకు తిట్టుకున్న పోటీదారులు నవ్వుతూ ఒకరిని మరొకరు పలకరించుకున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

maa elections prakash raj meets mohan babu
Author
Hyderabad, First Published Oct 10, 2021, 11:31 AM IST

మా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ‘మా’ సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇప్పటికే ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఇరు ప్యానెల్ సభ్యులు పోలింగ్ కేంద్రంలో ఉండి Maa elections సరళి పరిశీలిస్తున్నారు. అలాగే నిన్నటి వరకు తిట్టుకున్న పోటీదారులు నవ్వుతూ ఒకరిని మరొకరు పలకరించుకున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 

ప్రకాష్ రాజ్  వచ్చి.. మోహన్ బాబును నమస్తే అన్నయ్యా.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విష్ణును దగ్గరికి పిలిచి ప్రకాష్‌తో కరచాలనం చేయించారు. అనంతరం ఇద్దరూ నవ్వుతూ ఆలింగనం చేసుకున్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఏ స్థాయిలో వార్ నడిచిందో అందరికి తెలిసిందే. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. బ్యాలెట్ ఓట్ల విషయంలో మంచు విష్ణు ప్యానెల్ అవకతవకలకు పాల్పడుతున్నట్లు, మోహన్ బాబు దీన్ని వెనుకుండి నడిపిస్తున్నారని, ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Also read మంచి మెటీరియల్ దొరికిందన్న చిరు.. విష్ణు, ప్రకాష్ రాజ్ పై బాలయ్య కామెంట్

దీనికి కౌంటర్ గా Manchu vishnu... వివాదంలోకి తన కుటుంబ సభ్యులను లాగితే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ విధంగా తిట్టుకున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోలింగ్ కేంద్రంగా అలా సన్నిహితంగా కనిపించడం, అందరినీ షాక్ కి గురిచేసింది. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్న విషయం తెల్సిందే. ఎప్పుడూ లేనంతగా ఈ సారి మా ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి.Prakash raj, నాగబాబు ఒకవైపు నరేష్ మంచు విష్ణు మరోవైపు ఉండి, మాటల దాడి చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios