Asianet News TeluguAsianet News Telugu

MAA elections: 'మా' నయా పాలకవర్గం... ఎన్నికలలో గెలుపొందిన సభ్యులు వీరే!

ఎప్పటిలాగే మా పాలక వర్గం ఇరు ప్యానెల్ సభ్యులతో ఏర్పడింది.Manchu vishnu, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ నుండి ప్రధాన పదవులకు పోటీ పడిన వారు గెలుపోటములు చవిచూశారు.

maa elections this is the list of winners
Author
Hyderabad, First Published Oct 12, 2021, 9:17 AM IST

 మా ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగిన పోరులో కొందరు విజేతలు కాగా, మరికొందరు పరాజితులు అయ్యారు. MAA elections లో ప్రధానమైన మా అధ్యక్ష పదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్నారు. 383 ఓట్లు పొందిన మంచు విష్ణు 109ఓట్ల మెజారితో ప్రకాష్ రాజ్ పై గెలుపొందారు. ప్రకాష్ రాజ్ కి 274 ఓట్లు పోల్ అయ్యాయి. 


ఎప్పటిలాగే మా పాలక వర్గం ఇరు ప్యానెల్ సభ్యులతో ఏర్పడింది.Manchu vishnu, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ నుండి ప్రధాన పదవులకు పోటీ పడిన వారు గెలుపోటములు చవిచూశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ గెలుపొందారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి రఘుబాబు, మాదాల రవి, పృథ్వి రాజ్, గౌతమ్ రాజు, శివ బాలాజీ విజయం సాధించారు. ఈసీ సభ్యులుగా మొత్తం 18మంది పోటీపడ్డారు. వీరిలో మంచు విష్ణు ప్యానెల్ నుండి 10, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి 8 మంది గెలుపొందారు. 

Also read `మా ఎన్నికలు` మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు.. చిరంజీవిని ఉద్దేశించేనా?.. టాలీవుడ్‌లో దుమారం..

మా అధ్యక్షుడు -  మంచు విష్ణు (383 ఓట్లు)
 జనరల్ సెక్రటరీ - రఘుబాబు (341 ఓట్లు)
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్  (375 ఓట్లు)
జాయింట్ సెక్రటరీలు - ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు)
వైస్ ప్రెసిడెంట్స్‌ - మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు)

మంచు విష్ణు ప్యానల్‌లో గెలుపొందిన ఈసీ మెంబర్స్‌

 గీతా సింగ్‌ (342 ఓట్లు)
 అశోక్‌ కుమార్‌ (336 ఓట్లు)
 శ్రీలక్ష్మీ (330 ఓట్లు)
 సి.మాణిక్‌  (326 ఓట్లు)
 శ్రీనివాసులు (296 ఓట్లు)
 హరనాథ్‌బాబు (296 ఓట్లు)
 ఎన్‌.శివన్నారాయణ (290 ఓట్లు)
 సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు)
 శశాంక్‌ (284 ఓట్లు)
  బొప్పన విష్ణు (271 ఓట్లు)

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో గెలుపొందిన ఈసీ మెంబర్స్‌

 శివారెడ్డి  (362 ఓట్లు)
 బ్రహ్మాజీ (334 ఓట్లు)
 ప్రభాకర్‌ (319 ఓట్లు)
 తనీష్‌ (306 ఓట్లు)
 సురేశ్‌ కొండేటి (294 ఓట్లు)
  కౌశిక్‌ (269 ఓట్లు)
 సుడిగాలి సుధీర్‌ (279 ఓట్లు)
 సమీర్‌ (282 ఓట్లు)

Also read `మా`లో మరో ట్విస్ట్.. అవకతవకలపై విచారణ జరపాలని మంచు విష్ణుకి శివాజీరాజా అల్టిమేటం..

Follow Us:
Download App:
  • android
  • ios