Asianet News TeluguAsianet News Telugu

`మా`లో మరో ట్విస్ట్.. అవకతవకలపై విచారణ జరపాలని మంచు విష్ణుకి శివాజీరాజా అల్టిమేటం..

మంచు విష్ణు ప్యానెల్‌తో పోటీ పడ్డా ప్రకాష్‌రాజ్‌, ఆయన ప్యానెల్‌ పరాజయం చెందడంతో రాజీనామాలు మొదలయ్యాయి. ప్రకాష్‌రాజ్‌ని మొదట్నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన మెగా ఫ్యామిలీలోని మెగా బ్రదర్‌ నాగబాబు తన రాజీనామా ప్రకటించారు. 

one more twist in maa election and shivaji raja ulimatum to manchu vishnu
Author
Hyderabad, First Published Oct 11, 2021, 7:13 PM IST

`మా` ఎన్నికల వేడి ముగిసింది. గత నెల రోజులుగా హీటెక్కించిన `మా` ఎన్నికలు ఆదివారం పోలింగ్‌తో చరమగీతం పాడాయి. అయితే `మా` ఎన్నికల రిజల్ట్ ప్రభావం బాగానే వినిపిస్తుంది. మంచు విష్ణు ప్యానెల్‌తో పోటీ పడ్డా ప్రకాష్‌రాజ్‌, ఆయన ప్యానెల్‌ పరాజయం చెందడంతో రాజీనామాలు మొదలయ్యాయి. ప్రకాష్‌రాజ్‌ని మొదట్నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన మెగా ఫ్యామిలీలోని మెగా బ్రదర్‌ నాగబాబు maaకి తన రాజీనామా ప్రకటించారు. 

సంకుచిత మనస్తత్వాలు కలిగిన వారి మధ్య తాను కొనసాగలేనని nagababu తన రాజీనామా ప్రకటించారు. మరోవైపు సోమవారం మీడియా వేదికగా prakash raj తన రాజీనామా ప్రకటించారు. ప్రాంతీయ వాదం వల్లే తాను ఓడిపోయానని, ఇకపై తాను గెస్ట్ ఆర్టిస్ట్ గానే ఉంటానని వెల్లడించారు. అయితే ప్రకాష్‌రాజ్‌ రాజీనామా విషయంలో మంచు విష్ణు అభ్యంతరం చెబుతూ, రాజీనామా నిర్ణయం సరైనది కాదని, వెనక్కి తీసుకోవాలని, ఆ తర్వాత తాను మిమ్మల్ని కలుస్తాని తెలిపారు. 

related news: బ్రేకింగ్... మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా... టాలీవుడ్ కి నేను అతిథిగానే ఉంటాను

ఇదిలా ఉంటే తాజాగా మరో షాక్‌ తగిలింది manchu vishnuకి. `మా`లో అవకతవకలు జరిగాయని, నిజనిర్థారణ కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు మాజీ `మా` అధ్యక్షుడు శివాజీరాజా. `మా` సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. కాకపోతే ఆయన కొత్తగా ఎన్నికైన మంచు విష్ణు ప్యానెల్‌కు ఓ అల్టిమేటం జారీ చేశారు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, నరేష్‌ తప్పులు రుజువైతే తగిన చర్యలు తీసుకోవాలని.. ఇదంతా 15 రోజుల్లో నిజనిర్ధారణ చేసి తగిన చర్యలు తీసుకోకపోతే తానూ రాజీనామా చేస్తానని శివాజీరాజా ప్రకటించారు.  

దీంతో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చినట్టైంది. అయితే ఎన్నికల ప్రారంభానికి ముందు నుంచే నరేష్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. హేమ లాంటి వాళ్లు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంతేకాదు విదేశాల్లో బిగ్‌స్టార్స్ తో నిర్వహించిన ఈవెంట్ల ద్వారా వచ్చిన డబ్బెంతా, దాన్ని ఏం చేశారని ఆ మధ్య బాలకృష్ణ కూడా ప్రశ్నించారు. దీంతో `మా`లో గోల్‌మాల్‌ జరిగిందనే వాదన ఊపందుకుంది. ఇప్పుడు శివాజీరాజా ఏకంగా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేయడం, లేదంటే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించడం మరింత చర్చనీయాంశంగా మారుతుంది. 

ఇక నిన్న(ఆదివారం) జరిగిన `మా` ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. అధ్యక్షుడిగా విష్ణు ఏకంగా 107 ఓట్ల తేడాతో ప్రకాష్‌రాజ్‌పై గెలుపొందారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో కేవలం శ్రీకాంత్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలుపొందగా, వైస్‌ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, సురేష్‌ కొండేటి ఈసీ మెంబర్‌గా విజయం సాధించారు. అనసూయ, సుడిగాలి సుధీర్‌ లాంటి చాలా మంది ప్రముఖులు ఓటమి పాలయ్యారు. జాయింట్‌ సెక్రెటరీగా రఘబాబు విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios