మా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నటులు మురళీ మోహన్, ప్రస్తుత ఎన్నికలపై స్పందించారు. ఆయన తన ఓటు ఎవరికో పరోక్షంగా తెలియజేశారు.
గతంలో మా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నటులు మురళీ మోహన్, ప్రస్తుత ఎన్నికలపై స్పందించారు. ఆయన తన ఓటు ఎవరికో పరోక్షంగా తెలియజేశారు. గతంలో పరిశ్రమలో సమస్యలు వస్తే చక్కదిద్దడానికి దాసరి నారాయణరావు, డి రామానాయుడు వంటి పెద్దలు ఉండేవారు అన్నారు. ఓ వేదికపై ఆ బాధ్యత చిరంజీవి గారిని తీసుకోవాలని నేను అడిగాను అన్నారు. కరోనా సంక్షోభంలో పేదల నటుల కోసం చిరంజీవి సొంత డబ్బులు కోటి రూపాయలు ఇవ్వడంతో పాటు, నిధులు సేకరించి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేశారని మురళీమోహన్ తెలియజేశారు.
మరి ప్రస్తుత MAA elections లో మీ ఓటు ఎవరికి అనగా.. బుద్దిమంతుడు, సమర్ధుడికే నా ఓటు అన్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరిలో సమర్థుడు ఎవరని భావిస్తున్నారు అని రిపోర్టర్ అడుగగా, ఇద్దరూ సమర్దులే, గట్టిపోటీ ఉంది. సమ ఉజ్జీలు కాబట్టే పోటీలో నిలుచున్నారు అన్నారు. నా ఓటు ఎవరికో ఓపెన్ గా చెబితే ఇంకా బ్యాలెట్ బాక్స్ ఎందుకు, గోప్యత ఏముంటుంది అన్నారు. అయితే మాటల్లో ఆయన తన ఓటు యువకుడికే అని చెప్పడం ద్వారా, మంచు విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా తెలియజేశారు.
యువకుడు అంటే మంచు విష్ణునే కదా అని రిపోర్ట్ అడుగగా.. ఇద్దరూ యువకులే, ఆ మాటకొస్తే నేను కూడా యువకుడినే అని, తప్పించుకునే ప్రయత్నం చేశారు మురళీ మోహన్. పరిశ్రమలోని సీనియర్ నటులు దాదాపు మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికలలో కుల, సామాజిక వర్గాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా కమ్మ వర్సస్ కాపు అన్నట్లు మా అధ్యక్ష ఎన్నికలు మారాయి. రెండు ప్యానెల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, గెలువు ఎవరిది అనేది ఆసక్తిగా మారింది.
Also read Maa Elections: ఇప్పుడు దాసరి విలువ టాలీవుడ్‌కి తెలుస్తోంది.. సీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు
ఇక ఎన్నికల తరువాత యుద్దాలు జరుగుతాయంటున్నారు... దానికి మీరేమంటారు అని రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు యుద్దాలు ఏమి జరగవని, ఎన్నికల అనంతరం అందరూ కామ్ అయిపోతారు. బాంబులు వేసుకునేది ఏమీ ఉండదు, కేవలం దీపావళి టపాసులు పేలుతాయని మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
