ప్రకాష్ రాజ్ విషయంలో నాగబాబు రెండు నాల్కల ధోరణి... ఆ విషయంలో అడ్డంగా బుక్కయ్యాడు!
నిన్న ఓ టీవీ ఛానల్ ఇంటరాక్షన్ పాల్గొన్న Nagababuకు ఓ గడ్డు సమస్య ఏర్పడింది. గతంలో నాగబాబు ప్రకాష్ రాజ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్వీట్, న్యూస్ రిపోర్టర్ చదివి వినిపించారు.
MAA elections అధ్యక్ష బరిలో దిగిన ప్రకాష్ రాజ్ కి నాగబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తనతో పాటు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు Pawan kalyan మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఇక ప్రకాష్ రాజ్ ప్రత్యర్థుల సవాళ్లకు, విమర్శలకు నాగబాబు స్వయంగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ ని విమర్శిస్తే తనను విమర్శించినంత గా ఫీల్ అవుతూ, మంచు విష్ణు, నరేష్ వంటివాటిపై విరుచుకుపడుతున్నారు
.
అయితే నిన్న ఓ టీవీ ఛానల్ ఇంటరాక్షన్ పాల్గొన్న Nagababuకు ఓ గడ్డు సమస్య ఏర్పడింది. గతంలో నాగబాబు ప్రకాష్ రాజ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్వీట్, న్యూస్ రిపోర్టర్ చదివి వినిపించారు. ఆ ట్వీట్ లో ప్రకాష్ రాజ్ ని కుహనా మేధావి, దర్శకులను, నిర్మాతలను డబ్బుల కోసం హింసించిన దుర్మార్గుడిగా నాగబాబు వర్ణించాడు. ఇంకా చాలా మాటలే అన్నారు. మొత్తంగా ప్రకాష్ రాజ్ క్రమశిక్షణ, జ్ఞానం లేని వ్యక్తిగా చిత్రీకరించారు.
నాగబాబు ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడడానికి కారణం... తాను వ్యతిరేకించే బీజేపీ పార్టీతో జనసేన పార్టీ చేతులు కలపడాన్ని ప్రకాష్ రాజ్ వ్యతిరేకించారు. బీజేపీ కంటే అత్యధిక ఓటు షేర్ కలిగిన జనసేన తిరుపతి పార్లమెంట్ బైపోల్ నందు బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ, ఎన్నికల నుండి తప్పుకోవడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తనను నిరాశపరిచాడని, ఒకప్పుడు తిట్టిన పార్టీలో చేరి, నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారు అన్నారు.
ఈ మాటలకు సమాధానంగా నాగబాబు ఆ స్థాయిలో ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డారు. ఇది జరిగి దాదాపు పదినెలలు అవుతుండగా సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రకాష్ రాజ్ పట్ల నాగబాబు ధోరణి సానుకూలంగా మారిపోయింది. మా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రకాష్ రాజ్ ని అపర మేధావిగా, నిబద్ధత కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. అతడు కష్టపడే తత్త్వం కలవాడని, మా కు సేవ చేయాలనే ఉద్దేశంతో కోట్ల సంపాదన కూడా వదులుకోవడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
Also read అరాచకం.. చూపించడంలో తెగించిన నభా నటేష్... షార్ట్ ఫ్రాక్ వేసుకొని అలా కూర్చోవడంతో జంక్షన్ జామ్ అయ్యింది!
మరి గతంలో ప్రకాష్ రాజ్ ని కుహనా మేధావి, క్రమశిక్షణ లేని వాడని తిట్టారు కదా అని అడిగిన రిపోర్టర్ పై నాగబాబు మండిపడ్డాడు. ప్రకాష్ రాజ్ లో మార్పు రాకూడదా, ఎప్పుడూ ఒకలా ఉంటారా అని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. నాగబాబు వ్యవహారం దగ్గరగా గమనించిన వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా రెండు నాల్కల ధోరణి అంటున్నారు. ఐనవాళ్లను ప్రశ్నిస్తే కుహనా మేధావి... మన శత్రువులను తిడితే ప్రపంచ మేధావి అన్న తీరుగా నాగబాబు వ్యవహరిస్తున్నారు, అంటున్నారు.