Asianet News TeluguAsianet News Telugu

Manchu vishnu: మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం!

2021-23 రెండేళ్ల కాలానికి మా అధ్యక్షుడిగా Manchu vishnu నియామకం అయినట్లు సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. 


 

maa elections manchu vishnu swears  as maa president
Author
Hyderabad, First Published Oct 16, 2021, 12:36 PM IST

మంచు విష్ణు నేడు మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ మంచు విష్ణు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2021-23 రెండేళ్ల కాలానికి మా అధ్యక్షుడిగా Manchu vishnu నియామకం అయినట్లు సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. 


అలాగే మంచు విష్ణు ప్యానెల్ తరుపున గెలిచిన ట్రెజరర్ శివబాలాజీ, వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు ప్రమాణస్వీకారం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన పృథ్విరాజ్, జనరల్ సెక్రటరీ గా గెలిచిన రఘుబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.అలాగే పది మంది ఈసీ సభ్యుల చేత ఎన్నికల అధికారి ప్రమాణస్వీకారం చేయించి, సర్టిఫికెట్స్ జారీ చేశారు. 


మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన తన స్పీచ్ లో Mohan babu, మంచు విష్ణులపై ప్రసంశలు కురిపించారు. పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

Also read MAA elections మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరుకు ఆహ్వానం లేదా?
ఊహించిన విధంగానే Prakash raj ప్యానెల్ తరపున గెలిచిన శ్రీకాంత్, బెనర్జీ, ఉత్తేజ్ తో పాటు 8మంది ఈసీ సభ్యులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. మంచు విష్ణు ప్యానెల్ స్వేచ్ఛగా పని చేసుకోవడానికి వీలుగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల చేత రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. మరోవైపు మంచు విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించలేదని సమాచారం. చిత్ర పరిశ్రమలో పెద్దన్నగా ఉంటూ.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన chiranjeevi ని ఆహ్వానించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Also read బ్రహ్మీ, ఆలీ, సునీల్, పోసాని... టాలీవుడ్ టాప్ టెన్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్.. రోజుకు అన్ని లక్షలా! First Published Oct 16, 2021, 9:12 AM IST

MAA సభ్యులకు మోహన్ బాబు ఫోన్ చేసి ఆహ్వానించారట.  మా సభ్యులందరికి మెస్సేజ్ రూపంలో ఇన్విటేషన్ పంపారట.ఎన్నికల ఫలితాల అనంతరం మంచు విష్ణు చిరంజీవిపై కొన్ని ఆరోపణలు చేశారు. చిరంజీవి అంకుల్ తనను ఎన్నికల నుండి తప్పొకోమన్నారని, చరణ్ కూడా నాకు ఓటు వేసి ఉండడు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎన్నికల తరువాత ప్రకాష్ రాజ్  ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులు రాజీనామాలు చేశారు. అలాగే మోహన్ బాబు, మంచు విష్ణు, నరేష్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి ఆరోపణలు, నిర్ణయాల వెనుక చిరంజీవి ఉన్నట్లు భావిస్తున్న మోహన్ బాబు కుటుంబం చిరంజీవికి ఆహ్వానం పంపలేదని అంటున్నారు. 

Also read తమన్నా తక్కువదేం కాదు...రేటు పెంచటానికి అదిరిపోయే ట్రిక్
 

Follow Us:
Download App:
  • android
  • ios