Asianet News TeluguAsianet News Telugu

తమన్నా తక్కువదేం కాదు...రేటు పెంచటానికి అదిరిపోయే ట్రిక్

 సిల్వర్‌ స్క్రీన్‌పై తమన్నా నటించిన ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్‌’ వచ్చేసాయి. ఇక  ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘ఎఫ్‌ 3’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే వరుణ్‌ తేజ్‌ ‘గని’ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా చేయనున్నారు.

Tamannaah hikes remuneration for senior actors
Author
Hyderabad, First Published Oct 16, 2021, 10:56 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మిల్కీబ్యూటి తమన్నా కెరీర్ పెద్ద గొప్పగా ఏమీ లేదు. మొన్న నితిన్ తో చేసిన అంధాధూన్ రీమేక్ మాస్ట్రో కూడా నటన పరంగా ఆమెకు మార్కులు తెచ్చిపెట్టిందే కానీ సినిమాలు తెచ్చి పెట్టలేకపోయింది. ఉన్నంతలో రీసెంట్ గా రిలీజైన సీటీమార్ సినిమానే  కాస్త ఊపు తెచ్చింది. ఆమె  "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో హీరో మహేశ్‌బాబుతో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడింది. దానికన్నా ముందు 2019లో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో ఓ కీలక పాత్ర చేసింది. తెలుగులో పెద్దగా సినిమాలు తగ్గించేసిన ఈ భామ ఈ ఏడాది మాత్రం మొత్తం టాలీవుడ్‌ మీదే ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె రెమ్యునరేషన్  పెంచేసిందని సమాచారం. డిమాండ్ లేకుండా రేటు పెంచటమేంటనేది డిస్కషన్ లో మారింది. అయితే అందుకు ఆమె ఓ స్కీమ్ ఫాలో అవుతోందిట.

అందుతున్న సమాచారం మేరకు రెగ్యులర్ గా తమన్నా కోటిన్నర రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోంది. అయితే సీనియర్ హీరోలు అంటే అరవైలు దాటిన వెంకటేష్, నాగార్జున, చిరంజీవిలతో చేస్తే ఆమెకు ఎక్కువ రెమ్యునేషన్ అడుగుతోంది. ఎందుకంటే ఆ హీరోలకు పెయిర్ గా ఎవరూ సెట్ అవ్వటం లేదు. దాంతో రెండు కోట్లు వరకూ ఆమెకు పే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ తో ఎఫ్ 3, మెహర్ రమేష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ లో చిరు సరసన ఎక్కువ తీసుకుంటోందని వినికిడి.

మరో ప్రక్క హీరోయిన్‌గా ఫేడవుట్ అవుతున్న తరుణంలో  సపోర్టింగ్ రోల్స్ చేయడానికి సిద్దపడుతోంది. మాస్ట్రోలో హీరోయిన్ కాకుండా సినిమాకు కీలకమైన పాత్ర చేయటం ద్వారా ఇండస్ట్రీకి తన ఉద్దేశం ఏంటో తమన్నా చెప్పినట్లైందని అంటున్నారు. దీంతో తమన్నాకు మరిన్నిఆఫర్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ప్రస్తుతం ఆమె సత్యదేవ్‌ 'గుర్తుందా శీతాకాలం', 'ఎఫ్‌ 3', 'దటీజ్‌ మహాలక్ష్మి' సినిమాలు చేస్తోంది. అలాగే హిందీలో 'బోలె చుడియాన్‌' చిత్రంలోనూ కనిపించనుంది. 

Also read ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయకపోవడనికి కారణం అదే.. వివాదాలపై స్పందించిన విజయశాంతి

సిల్వర్‌ స్క్రీన్, స్మాల్‌ స్క్రీన్, డిజిటల్‌ స్క్రీన్‌లను బ్యాలెన్స్‌ చేస్తూ ఆల్‌ రౌండర్‌ అనిపించుకుంటున్నారు హీరోయిన్‌ తమన్నా. ఆల్రెడీ ‘లెవన్త్‌ అవర్‌’, ‘నవంబర్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లతో డిజిటల్‌ స్క్రీన్‌పై సత్తా చాటిన ఈ బ్యూటీ తాజాగా మరో వెబ్‌ ఫిల్మ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ‘ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి’లో నటిస్తున్నారు తమన్నా. ఇందులో రితేష్‌ దేశ్‌ముఖ్‌ (హీరోయిన్‌ జెనీలియా భర్త) మరో లీడ్‌ యాక్టర్‌. ఇటీవలే షూటింగ్‌ మొదలైంది. 

Also read `పెద్దన్న`గా వస్తోన్న రజనీకాంత్‌.. `అన్నాత్తే` తెలుగు టైటిల్‌

ఇందులో మ్యారేజ్‌ బ్యూరో ప్రతినిధిగా తమన్నా, విడాకులు ఇప్పించే లాయర్‌గా రితేష్‌ కనిపిస్తారని బాలీవుడ్‌ టాక్‌. స్మాల్‌ స్క్రీన్‌ విషయానికొస్తే.. తమన్నా హోస్ట్‌గా చేస్తున్న ‘మాస్టర్‌ చెఫ్‌’ ప్రోగ్రామ్‌   స్ట్రీమింగ్‌ అవుతోంది.  అలాగే వరుణ్‌ తేజ్‌ ‘గని’ చిత్రంలో తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios