Asianet News TeluguAsianet News Telugu

'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం... ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు ఝలక్!

అక్టోబర్ 10న 'మా' అధ్యక్ష ఎన్నికలు (MAA Elections) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. గెలుపు కోసం మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి.

maa elections manchu vishnu accepts prakash raj panel members resignation
Author
Hyderabad, First Published Dec 12, 2021, 1:22 PM IST

‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu)సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీ‌కాంత్‌, ఉత్తేజ్ స‌హా మొత్తం 11 మంది స‌భ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని క్లారిటీ ఇచ్చారు విష్ణు.


అక్టోబర్ 10న 'మా' అధ్యక్ష ఎన్నికలు (MAA Elections) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. గెలుపు కోసం మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు ప్యానెల్ సభ్యులు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందో అన్న ఉత్కంఠ నడిచింది. చివరికి ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. 


ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాష్ ప్యానెల్ తరపున గెలిచిన 11మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపు నుండి శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా, ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మరో ఎనిమిది మంది విజయం సాధించడం జరిగింది. 


వీరి రాజీనామాపై అధ్యక్షుడిగా విష్ణు అసహనం వ్యక్తం చేశారు. రాజీనామాలు విరమించుకోవాలని కోరారు. అయితే మంచు విష్ణు అభ్యర్థన తోసిపుచ్చిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు, రాజీనామాలకు కట్టుబడి ఉన్నారు. దీంతో మంచు విష్ణు రెండు నెలల అనంతరం వారి రాజీనామాలు అంగీకరిస్తున్నట్లు తెలియజేశారు. వీరి స్థానంలో మంచు విష్ణు తనకు నచ్చిన అభ్యర్థులను ఎంచుకోనున్నారు. మా బై లాస్ ప్రకారం ఆ అధికారం అధ్యక్షుడికి కలదు. 

Also read Bheemla Nayak: ఆత్మను చంపేశారు... ఫలితం ఎలా ఉంటుందో
కాగా ఎన్నికల్లో అవకతవకతకులు జరిగాయని, కేవలం స్థానికుడు కాదనే నెపంతో ఓడించారంటూ   ప్రకాష్‌ రాజ్‌, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను మంచు విష్ణు ఇంకా ఆమోదించలేదు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలుపుకోసం నాగబాబు (Nagababu)తో పాటు మెగా ఫ్యామిలీ తీవ్ర కృషి చేసిన విషయం తెలిసిందే. 

Also read Rajinikanth: మొదటి చూపులోనే పడిపోయిన సూపర్ స్టార్... రజినీకాంత్ ప్రేమ వివాహం గురించి తెలుసా!

కాగా ఆదివారం (12.12.2021) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'మా' సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ - ''మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మెడికవర్ వాళ్ళు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను'' అని అన్నారు.

వారం రోజుల్లో ప్రకటన...
మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. 'మా' కమిటీ మీటింగ్ జరిగింది. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తాం.

రాజీనామాలు ఆమోదం...
ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేసారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాను. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగింది. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు 'మా' సభ్యులుగా కొనసాగుతారు. నాగబాబు, ప్రకాష్ రాజు కూడా 'మా' సభ్యులుగా కొనసాగుతారు. 

డాక్టర్ అనిల్ (మెడికవర్ హాస్పటల్)
రొటీన్ గా చేసే హెల్త్ చెకప్ ఇవి. ఈ హెల్త్ చెకప్ లు మా సభ్యులకు చేయటం చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు టెస్టులు చేస్తున్నాము.

రఘుబాబు - 'మా' జనరల్ సెక్రటరీ
హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. దానిని ఫస్ట్ ప్రయార్టీగా తీసుకుని, సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు 'మా' ప్రెసిడెంట్ విష్ణు. ముందుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విష్ణు ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా జరుగుతాయి. 

శివబాలాజీ - 'మా' ట్రెజరర్
హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ. మా సభ్యులు అందరూ దీనిని ఉపయోగించుకోవాలి. 'మా' సభ్యుల హెల్త్ కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో 'మా' ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ అయ్యారు.

మాదాల రవి - 'మా' వైస్ ప్రెసిడెంట్
మా సభ్యుల ఆరోగ్యం ముఖ్యం. సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పటల్ కి కృతజ్ఞతలు. చాలా హాస్పటల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి  మెడికవర్ హాస్పటల్ ముందుకు వచ్చింది. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios