Asianet News TeluguAsianet News Telugu

MAA elections ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి అనసూయ, సుడిగాలి సుధీర్ ఓటమి

Prakash raj ప్యానెల్ నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్ ఓటమిపాలయ్యారు. 

maa elections jabardasth fame anasuya sudigali sudheer lost
Author
Hyderabad, First Published Oct 11, 2021, 1:14 PM IST

మా ఎన్నికలు ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తుంది. మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం చూపించింది. మా ఎన్నికల చరిత్రలోనే అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కాగా... 107 ఓట్ల మెజారిటీతో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై అధ్యక్షుడిగా గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలో కూడా మంచు విష్ణు ప్యానెల్ నుండి అత్యధికంగా గెలుపొందారు. 

Prakash raj ప్యానెల్ నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్ ఓటమిపాలయ్యారు. ప్రాధమికంగా అనసూయ గెలిచారని నిన్న సమాచారం వచ్చింది. అయితే Anasuya కూడా పరాజయం పొందారని తాజా ఫలితాలు తెలియజేస్తున్నాయి. దీనితో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు జబర్దస్త్ ఫేమ్ ఆర్టిస్ట్స్ ఓటమి చెందినట్లు అయ్యింది. 

Also read బ్రేకింగ్... మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా... టాలీవుడ్ కి నేను అతిథిగానే ఉంటాను

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ గెలిచారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి ట్రెజరర్ గా శివబాలాజీ, జనరల్ సెక్రెటరీగా రఘుబాబు గెలుపొందారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, థర్టీ ఇయర్స్ పృథ్వి సైతం గెలుపొండం జరిగింది. జాయిన్ సెక్రటరీగా Manchu vishnu ప్యానెల్ నుండి పోటీ చేసిన కరాటే కళ్యాణి ఓటమి కాగా, గౌతమ్ రాజు గెలిచారు. 

Also read Maa elections: విక్టరీ అనంతరం ప్రకాష్ రాజ్ ని కౌగిలించుకొని ఏడ్చేసిన మంచు విష్ణు

MAA elections ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ తాను మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు వాడిని కాదన్న ఒక్క కారణంతో మా సభ్యులు ఓడించారని, ఇలాంటి అజెండా ఉన్న మా లో సభ్యునిగా ఉండలేనని ఆవేదన వ్యక్తం చేశారు. మా లో సభ్యుడిని కాకుండా టాలీవుడ్ తో తన అనుబంధం కొనసాగుతుందని, తెలుగు సినిమాలలో నటిస్తాను అన్నారు. అసలు కథ ముందు ఉంది... ఇది ఇంతటితో ముగియలేదని.. ప్రకాష్ రాజ్ చెప్పడం కొసమెరుపు. 

Follow Us:
Download App:
  • android
  • ios