మా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన జరగగానే Manchu vishnu భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పక్కనే ఉన్న ప్రకాష్ రాజ్ ని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు. 

మా యుద్ధం ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో హీరో మంచు విష్ణు మా అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. అనేక వివాదాలు, విమర్శల నడుమ సాగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించారు. ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విషయంలో పోటీ తీవ్ర స్థాయిలో నడిచింది. మొదట్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ జోరు చూపించింది. ఆ ప్యానెల్ కి చెందిన శివారెడ్డి, కౌశిక్, అనసూయ విజయం సాధించారు. ఆ తరువాత మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఊపందుకున్నారు. 


కీలకమైన జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులు సైతం మంచు విష్ణు ప్యానెల్ నుండి పోటీ చేసిన రఘుబాబు, శివబాలాజీ దక్కించుకున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిని మాత్రం మంచు విష్ణు ప్యానెల్ కోల్పోయింది. నటుడు బాబు మోహన్ పై ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన శ్రీకాంత్ 125 ఓట్ల భారీ మెజారిటీతో ఆ పదవి దక్కించుకున్నారు. 

Also read చిరు మందు వేయాలంది ఎవరికీ... పవన్ కల్యాణే కేనా ఆ చురకలు!


మా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన జరగగానే Manchu vishnu భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పక్కనే ఉన్న ప్రకాష్ రాజ్ ని కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నికల కోసం బద్ద శత్రువులుగా మారిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య అలాంటి సంఘటన చోటు చేసుకోవడం, ఆసక్తి రేపింది. 

Also read విష్ణు విజయానికి... ప్రకాశ్‌రాజ్ ఓటమికి కారణం అదే, నేనెప్పుడో చెప్పా: ‘‘మా’’ ఫలితాలపై సోమిరెడ్డి వ్యాఖ్యలు


ఇక మంచు విష్ణు మాట్లాడుతూ... ‘మనమంతా ఒకటే కుటుంబం. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే నాకు చాలా ఇష్టం. నరేశ్‌గారికి, సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌. ఆ ప్యానల్, ఈ ప్యానల్‌ అంటూ లేదు. మేం అందరం ఒకటే కుటుంబం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్‌ కలిగింది. ‘మా’ లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు’ అని అన్నారు. అనంతరం ‘తెలుగు బిడ్డ గెలిచాడు. విష్ణు మంచుకు ఆల్‌ ది బెస్ట్‌’ అని Prakash raj ఒక్క మాటతో ముగించారు. ఇక నిన్న సమయాభావం కావడంతో మరికొన్ని ఎన్నికల ఫలితాలు నేటికి వాయిదావేశారు.