నాకు క్యాన్సర్ లేదు.. పుకార్లపై అలీ స్పందన

First Published 20, Jul 2018, 2:44 PM IST
Lucky Ali clears the air on cancer and his chemotherapy tweet
Highlights

తన స్నేహితుడు క్యాన్సర్ బారిన పడి చనిపోవడంతో, కీమోథెరపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ తాను ఆ ట్వీట్ చేశానని  తనకు క్యాన్సర్ లేదని అన్నారు. ఒకప్పుడు అలీ పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది

ప్రముఖ గాయకుడు లక్కీ అలీ ఇటీవల 'డియర్ కీమోథెరపీ నువ్వు ఎప్పటికీ పరిష్కారం కాలేవు' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అదే సమయంలో సోనాలి బింద్రే కూడా తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో ఓ పక్క సోనాలీ అభిమానులతో పాటు అలీ అభిమానులు కూడా ఆందోళన చెందారు.

అలీకి కూడా క్యాన్సర్ సోకిందని భావించారు. ఈ మేరకు మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై స్పందించిన ఆయన ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ప్రస్తుతం తను  ఆరోగ్యంగా ఉన్నట్లు.. హిమాలయాల్లో ఉన్నట్లు వెల్లడించారు.

తన స్నేహితుడు క్యాన్సర్ బారిన పడి చనిపోవడంతో, కీమోథెరపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ తాను ఆ ట్వీట్ చేశానని  తనకు క్యాన్సర్ లేదని అన్నారు. ఒకప్పుడు అలీ పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. 60 ఏళ్లకు దగ్గరపడుతున్న అతడు తన పాటలతో ఎందరిలో ఆకట్టుకున్నాడు.  

loader