'సై.. రా' నుండి మరో ఫోటో లీక్!

Leaked photo from Sye Raa go viral
Highlights

కథ ప్రకారం సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని సమాచారం. అప్పటి నాగరికత, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కొన్ని కీలక యుద్ధ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ నుండి ఓ ఫోటో లీక్ అయింది. కొందరు వ్యక్తులు గుర్రాల మీద కనిపిస్తున్నట్లుగా లీకైన ఈ ఫోటో ఎన్నో విషయాలను బయటపెడుతోంది. కథ ప్రకారం సినిమాలో కొన్ని సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయని సమాచారం. అప్పటి నాగరికత, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గతంలో లీక్ అయిన ఫొటోల్లో చిరు, అమితాబ్ బచ్చన్ ల లుక్స్ బయటపడగా ఈసారి  లీక్ అయిన ఫొటోలో మాత్రం ఎవరూ కనిపించడం లేదు.

ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉండడంతో అందులో చిరు ఉన్నాడా లేదా అనేది తెలియడం లేదు. ఏదేమైనా ఈ లీక్ ఫోటోలు కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయనే చెప్పాలి. 

loader