హీరోయిన్ చోరీ!

lavanya tripathi about her childhood
Highlights

'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి తెలుగులో మంచి గుర్తింపే సంపాదించుకుంది

'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి తెలుగులో మంచి గుర్తింపే సంపాదించుకుంది. రీసెంట్ గా నిఖిల్ 'ముద్ర' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. అయితే ఈ అమ్మడు తన బాల్యంలో ఇంట్లో దొంగతనం చేసినట్లు తాజాగా వెల్లడించింది. రూ.5 రూపాయలు తన తల్లికి తెలియకుండా దొంగతనం చేసి చాక్లెట్లు కొనుక్కొని తిన్నానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. 

మరిన్ని విషయాలు చెబుతూ.. ''మా అమ్మ కొన్ని పద్దతులను ఫాలో అయ్యేవారు. ఆమెకున్న విలువలలో కొన్ని అయినా నేను పాటించాలని అనుకుంటాను. అందులో ఒకటి రాత్రి 7 గంటల దాటేలోపు ఇంటికి చేరుకోవాలి. నేను ఇది పాటించని ప్రతిసారి భయపడుతూ ఉంటాను'' అని స్పష్టం చేశారు. అలానే ఓసారి చిన్నతనంలో తన స్నేహితురాలి ఫోన్ ను లావణ్య తన బ్యాగులో పెట్టుకోవాల్సివచ్చింది. ఆ ఫోన్ ను తన తల్లి చూసి చాలా కోపం తెచ్చుకుందట. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవం అదేనని లావణ్య గుర్తుచేసుకుంది!

loader