మహేష్25.. లేటెస్ట్ అప్డేట్!

latest update on mahesh 25 movie
Highlights

ఈ సినిమా షూటింగ్ ను డెహ్రాడూన్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కాలేజ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటికే ఈ షెడ్యూల్ మొదలయ్యి ఇరవై రోజులు పూర్తయింది. ప్లానింగ్ ప్రకారం ఈ షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్రబృందం

సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను డెహ్రాడూన్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కాలేజ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటికే ఈ షెడ్యూల్ మొదలయ్యి ఇరవై రోజులు పూర్తయింది. ప్లానింగ్ ప్రకారం ఈ షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్రబృందం అక్కడ నుండి ఇప్పుడు హైదరాబాద్ కు రానుంది.

హీరోయిన్ పూజాహెగ్డే పార్ట్ పూర్తి కావడంతో ఆమె శుక్రవారం సాయంత్రమే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ కు వచ్చేశారు. ఈరోజు జరగనున్న 'సాక్ష్యం' ఆడియో ఫంక్షన్ లో అమ్మడు పాల్గోనుంది. ఇక మహేష్ బాబు సినిమా కొత్త షెడ్యూల్ ను అమెరికాలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు గడ్డంతో సరికొత్తగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక చిత్రబృందం అనుకున్నట్లుగా సినిమా పూర్తి చేసి ఏప్రిల్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ప్లాన్. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

loader