టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందంకి ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హాస్పిటల్ లో ఆయనకి ఆపరేషన్ జరిగింది. అయితే ఆయన్ని చూడడానికి, పరామర్శించడానికి ఎవరినీ అనుమతించకపోవడంతో ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఇంకా ఆయన ముంబైలోనే ఉన్నారు. ఆపరేషన్ తరువాత డాక్టర్లు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో వైద్యులకు అందుబాటులో ఉండాలని హాస్పిటల్ కి దగ్గరలోనే ఉంటున్నారని తెలుస్తోంది.

ఆ కారణంగానే ఆయన హైదరాబాద్ కి ఇంకా తిరిగి రాలేదట. త్వరలోనే హైదరాబాద్ కి బయలుదేరుతారని సమాచారం. 

తెలుగు ప్రేక్షకులకు దక్కిన నవ్వుల వరం.. బ్రహ్మీ బర్త్ డే స్పెషల్!

బ్రహ్మానందం ఆరోగ్యంపై పరుచూరి కామెంట్స్!

బ్రహ్మానందం ఆరోగ్యంపై కొడుకు క్లారిటీ!

హాస్య నటుడు బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ