ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకి ఇటీవల ముంబైలో గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ 'నాన్నగారికి ఆపరేషన్ జరిగింది.

ప్రస్తుతం కోలుకుంటున్నారు' అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. బ్రహ్మానందం ఆరోగ్యం గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. బ్రహ్మానందం గ్యాస్ సమస్యతో హాస్పిటల్ కి వెళ్తే అక్కడ వైద్యులు పరీక్షించి ఓ సర్జరీ అవసరమవుతుందని చెప్పినట్లు పరుచూరి తెలిపారు.

సర్జరీ పూర్తయిన తరువాత నాలుగైదు వారాలు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఆపరేషన్ ముంబైలో చేయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో అయితే పరామర్శలు ఎక్కువ ఉంటాయనే కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆపరేషన్ బాగానే అయిందని, బ్రహ్మానందం కోలుకుంటున్నట్లు, త్వరలోనే హైదరాబాద్ వస్తారని తెలిపారు. 

బ్రహ్మానందం ఆరోగ్యంపై కొడుకు క్లారిటీ!

హాస్య నటుడు బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ