Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో నందు వాడు చెప్పినట్టు చెయ్ లాస్య అని అనడంతో ఏంట్రా పెళ్ళాన్ని బ్రతిమిలాడినట్లు బ్రతిమలాడుతున్నావు అనగా అప్పుడు లాస్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వాసుదేవ్ తులసి జాగ్రత్తగా ఉండు అనగా ఇప్పుడు ఏమైంది అన్నయ్య అనడంతో ఇంట్లో పామును తెచ్చి పెట్టుకున్నావు. అయినా నీ భర్త మీద నీకు అంత నమ్మకం ఉందా. ఒక మగాడిగా చెప్తున్నాను ఇలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండు అనడంతో నందు ఇబ్బందిగా ఫీల్ అవుతుండగా తులసీ నందు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నీ భర్త మొఖం అమాయకంగా ఉంది అని నువ్వు నమ్ముతున్నావేమో అది చాలా డేంజర్ ఆ చిచ్చుబుడ్డిని నీ భర్తని లాగేసుకున్న లాగేసుకుంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండు తులసి అని జాగ్రత్తలు చెబుతుండగా తులసి నవ్వుతూ ఉండగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు.
అప్పుడు నందు ఒరేయ్ సంబంధం లేని విషయాల గురించి మాట్లాడకు అనడంతో నేను నా చెల్లెలు మంచి కోసం చెబుతున్నాను అని అంటాడు వాసుదేవ్. ఏమ్మా తప్ప అని తులసిని అడగడంతో వెంటనే తులసి ఏవండి తప్ప అని నందుని అడుగుతుంది. ఇంతలోనే లాస్య వాసుదేవ్ కోసం మజ్జిగ తీసుకొని వస్తుంది. అప్పుడు తులసి మీకు ఆ రూమ్ లో అన్ని అరేంజ్ చేశాను వెళ్లి పడుకోండి అనగా మీరు వెళ్లి పడుకోండి మేము తర్వాత పడుకుంటాము అని అంటాడు వాసుదేవ్. తర్వాత నందు అలవాటులో పొరపాటుగా లాస్య వెనకాల వెళుతుండడంతో నీ భార్య ఎవరు రా అని అనగా నందు షాక్ అవుతాడు. ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
అదేం ప్రశ్న రా అనగా మరి నీ ప్రవర్తన అలాగే ఉంది అనడంతో ఇప్పుడు నేనేం చేశాను రా అనగా తులసి నీ భార్య కాబట్టి నువ్వు తులసి గదిలోకి వెళ్లకుండా లాస్య వెనకాల వెళుతున్నావు ఏంటి అని అంటాడు. అప్పుడు నందు ఏంటి ఇలా దొరికిపోయాను అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. తులసి గదిలో లైట్ ఉంటుంది అనగా అలానే వదిలేసి వెళ్లి వేరే రూమ్ లో పడుకుంటావా వెళ్లి ఆ రూమ్ లో పడుకో పోయాడంతో నందు చేసేదేమీ లేక తులసి గదిలోకి వెళ్తాడు. అప్పుడు లాస్య కూడా వెళ్లండి నందగోపాల్ గారు అని లోలోపల కుళ్ళుకుంటూ బయటికి నవ్వుతూ మాట్లాడుతుంది. అప్పుడు నందు లోపలికి వెళ్లి తలుపు వేసుకునే సరికి లాస్య ఏం జరుగుతుందో అని బయట నుంచి టెన్షన్ గా చూస్తూ ఉంటుంది.
అప్పుడు వాసుదేవ్ ఏమ్మా ఆ గదిలోకి నువ్వు కూడా వెళ్తావా అని అడగగా లేదు అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అన్నయ్య పడుకోగానే చెప్తాను మీరు వెళ్లి మీ రూమ్ లో పడుకోండి అనడంతో మధ్యలో చూస్తే ఏంటి పరిస్థితి కాబట్టి నేను ఎలాగో అలా అడ్జస్ట్ అవుతాను తులసి అని అంటాడు నందు. మరోవైపు లాస్య టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చాడు పీకల వరకు మెక్కాడు వెళ్లి పడుకోవచ్చు కదా ఎవరి రూమ్ లో ఎవరు పడుకుంటే వారికి ఎందుకు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు కి ఫోన్ చేద్దాం అనుకోని వద్దులే తిక్క లేస్తే ఈ రూమ్ లోకి వచ్చేస్తాడు మళ్ళీ ఆ వాసుదేవ్ తో నాకు క్లాస్ పీకుతాడు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
వైపు తులసి నందు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు నందు పనిలో పనిగా లాస్యను ఇక్కడికి పిలిచేస్తాను లేదంటే రూమ్లో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు తులసి వెటకారంగా మామయ్య అత్తయ్య దివ్య వాళ్లను కూడా పిలవండి ఇక్కడ ఏదో ఒక మూల కూర్చుంటారు అని అంటుంది. అప్పుడు లాస్య ఒకే రూమ్ లో కలిసి ఉన్నారు అంటేనే నాకు నిద్ర రావడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య మొబైల్ ఫోన్లో పాటలు ఆన్ చేయగా రొమాంటిక్ పాటలు రావడంతో పాటలు ఆఫ్ చేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు తులసి నందు ఇద్దరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ తర్వాత నందు తులసి ఇద్దరూ మధ్యలో తల దిండ్లు అడ్డుపెట్టుకొని పడుకుంటారు.
మరోవైపు లాస్య నందు ఫోటో చూసి ఏంటి నందు ఇది యువతల నీకోసం నీ భారీ ఎదురు చూస్తుంటే పీడ విరగడయింది అనుకుంటున్నావా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాసుదేవ్ వచ్చి తలుపు కొడుతుండగా నందు తులసి ఇద్దరు నిద్ర లేస్తారు. అప్పుడు దివ్య ఏమైంది అంకుల్ అని అనడంతో ఏమైందా నిజంగా మీకు తెలియదా లేక అందరూ కట్టకట్టుకొని నాటకాలు ఆడుతున్నారా అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు నందు వెళ్లి తలుపు తీయగా అందరూ కలిసి లోపలికి వస్తారు. అప్పుడు లాస్య నందు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు వాసుదేవ్ కోపంగా మాట్లాడుతూ ఏరా తలుపులు అంతలా కొడుతున్న వినిపించడం వేదా అవకాశం దొరికింది కదా అని రోజంతా గదిలోనే ఉందామనుకున్నావా?
మిమ్మల్ని అడగాల్సినవి దులిపేయాల్సినవి కొన్ని ఉన్నాయి అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు అసలు నిజం తెలిసిపోయిందా అనుకుని నందు టెన్షన్ పడుతూ ఉంటాడు. బయటికి వెళ్దాం పదండి మీతో మాట్లాడాలి అని అంటూ ఏవండీ అనగా నువ్వు మధ్యలో రాకు అని పెళ్ళాంపై సీరియస్ అవుతాడు వాసుదేవ్. కడుపు రగిలిపోతుంది ప్రాణ స్నేహితుడు అని కూడా చూడకుండా ఇంత మోసం చేస్తాడా వాసుదేవ్ తులసి వాళ్ళను మరింత టెన్షన్ పెడుతూ ఉంటాడు. అప్పుడు నందు నిజం తెలిసిపోయింది అనుకొని నువ్వు తులసిని ఏమీ అనుకోకు తులసి తప్పేమీ లేదు ప్లీజ్ అని అంటాడు. ఆ మాటలకు లాస్య ఆశ్చర్య పోతుంది. అంకుల్ మీరు అమ్మని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అనడంతో జరిగిన విషయాలు ఈ మనసులో పెట్టుకోకు బాబు అని పరంధామయ్య అంటాడు.
అప్పుడు వాసుదేవ్ మరింత కోపంగా మాట్లాడుతూ ఉండగా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. వాసుదేవ్ అతని భార్య బయటకు వెళ్లి బొకే తీసుకుని వచ్చి నందుని తులసి పక్కన నిలుచమని చెబుతారు. అప్పుడు పెళ్లిరోజు శుభాకాంక్షలు అని చెప్పడంతో తులసీ నందు షాక్ అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇది చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాసుదేవ్ లాస్యను చూసి మా అందరికీ ఫోటోలు తీయి అనడంతో లాస్య లో లోపల తిట్టుకుంటూ తులసి నందు వాళ్లకు కలిపి ఫోటోలు తీస్తూ ఉంటుంది. అప్పుడు తులసి నందు ఇద్దరూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు నందు తులసి వెళ్లి పరంధామయ్య అనసూయ ఆశీర్వాదాలు తీసుకుంటారు.
