లంక చిత్రంలో రాశి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన దర్శకుడు మారుతి ప్రత్యేక పాత్రతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాశి
నిన్నటి తరం అందాల రాశి హీరోయిన్ రాశి తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోలింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నేమన దినేశ్, విష్ణులు నిర్మిస్తున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీలో రాశి ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
లంక పేరుతో రానున్న ఈ మూవీకి సంబంధించిన రాశి ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రాశి తన కేరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ అందించనున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి శ్రీముని దర్శకత్వం వహిస్తున్నారు.
