Asianet News TeluguAsianet News Telugu

కత్తి, పవన్ సమస్యను చిరంజీవి పరిష్కరించాలి-వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి

  • రోజురోజుకు ముదురుతున్న కత్తి పవన్ వివాదం
  • వివాదంలో తలదూర్చిన లక్ష్మీస్ వీరగ్రంధం దర్శకుడు
  • చిరంజీవి జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కేతిరెడ్డి డిమాండ్

 

lakshmis veeragranham director kethireddy joins kathi pawan controversy

కత్తి మహేష్ ,అభిమానుల వివాదం లో ఒక మంచి వారుగా ,ఆత్మీయ వ్యక్తిగా ప్రజల గుండెల్లో ఉన్న చిరంజీవి గారు జోక్యం చేసుకొని ఈ వివాదంనకు తెరదించాలని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చిరంజీవి ని అర్ధించారు. ఒక ప్రకటన లో గతంలో మీ పట్ల సినీ నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలు చేస్తే అందుకు నిరసన గా మీ అభిమానులు ఆయన పై దాడి చేయగా, మీరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించి ఒక మంచి సంస్కృతికి నిదర్శనమై ఆ వివాదంను పరిష్కరించారు.

 

కానీ పవన్ కల్యాణ్ ఆయనకున్న  గుణగణాలను బట్టి ఆయన ఎవరి కి తలవంచడు. ఇది జగమేరిగిన సత్యం. గతం లో కూడా  ప్రజారాజ్యం పార్టీ యువనేతగా కాంగ్రెస్ వారి పంచెలు విప్పాలి అని కూడా వారు ఒక సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడు. నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఎప్పుడు ఉంటుంది. తాము చెప్పాలనుకొన్న మాటలను నిక్కచ్చిగా చెప్పేందుకు సంకోచించరు.ఇక రాజకీయాలంటారా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసిన జనసేన పార్టీ లక్యం నచ్చితే జనం తప్పకుండా ఆదరిస్తారు...తను చంద్రబాబు నాయుడు గారికి గత ఎన్నికల్లో ప్రచారం చేసి అ పార్టీ విజయం లో భాగస్వామి అయ్యాడు కాబట్టి ..రాష్ట్రం లో ఆయన తన దుష్టికి వచ్చిన సమస్యలను  తీసుకుపోవటం ఆయన బాధ్యత.

 

ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన ,చంద్రబాబు కు మద్దతు ఇస్తాడా..లేక జగన్ కో,.బీజేపీ కో ఇస్తాడా,లేకపోతే ఆయనే సొంతం గా ఎన్నికల్లో పోటీ చేస్తాడా అనేది ఇప్పుడు మాట్లాడటం అనవసరం.ఆ రోజు ఉన్న రాజకీయసమికరణల పై ఆధార పడి ఉంటుంది ...ఇది ఆయన జనసేన పార్టీ భవిష్యత్తు... రాజకీయాల లో శాశ్విత శత్రువులు ఉండ రు....ఇది మొదటి గా పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రహించాలి ...రాజకీయం వేరు సినిమా అభిమానం వేరు....ఉదాహరణకు ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ పై నాయకులందరూ  విమర్శలు చేసారు.... అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు....అవకాశం లేనప్పుడు...అవసరం ను వాడు కోవటమై రాజకీయ సిద్ధాంతం. ఇది పవన్ కల్యాణ్ అభిమానులు తెలుసుకొని సంయమనం పాటించి మీ నాయకుడికి మంచి పేరును తీసుకువచ్చి ..సమజాసేవ లో నిమగ్నం కండి.. మీ నాయకుడు నినాదం అయిన ప్రశ్నించే హక్కుతో మీరు ప్రశ్నించుచూ ముందుకు వెళ్లి ప్రజాసమస్యల పట్ల అవగాహన పెంచుకొని నాయకుడికి ,పార్టీకి మంచి పేరు తీసుకురండి....మీలో చాలా మంది ఇతను ఏంటి మాకు సలహాలు అని అనుకొంటారు...మూడు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను చూసి బాధతో, చెపుతున్న మాటలు మాత్రమే. సలహా లు కావు . జనం లో ఉన్నదే...ఈ సందేశం.

 

ఇక అన్నయ్య చిరంజీవి గారి ని ఇప్పుడు జరుగుతున్న కత్తి మహేష్.పవన్ కళ్యాణ్ అభిమానుల గొడవల కారణం గా ప్రజలలో మీ కుటుంబం పట్ల ఉన్న గౌరవం సన్న గిల్లు తుంది ,మిమ్మల్ని అభిమానించే మా అందరిని ఈ వ్యవహారం ఆందోళన కు గురి చేయుచుంది. బైట అందరూ మీ కుటుంబం అంటే గిట్టని వారు ఈ వివాదంను  పెంచి పొషించుచూ నవుకొంటున్నారు. ఇందులో మూడవ వారి పాత్ర ప్రమేయం ఎక్కువ అయ్యింది. కత్తి మహేష్ విషయం ను గోరుతో పొయ్యే దానిని గొడ్డలి వరకు తీసుకురావటం. మీ కుటుంబంను అభిమానించే అందరికి చాలా బాధ అనిపించుచున్నది. మీరు గతంలో మీ అభిమానులకు ఎన్నో సంఘసేవ కార్యక్రమంలలో భాగస్వామ్యలు చేసి అభిమానులు రోడ్డు న పడటం కాదు ..మమ్మల్ని అభిమానించటం కాదు ప్రజలను అభిమానించండి అనే సందేశం తో నాంది పలికారు.

 

కానీ ఇప్పుడు ఉన్న హీరోల  అభిమానులు తమ హీరోను ఎవ్వరైనా ఏమన్నా అంటే ఒప్పుకోరు నిజమే కానీ మీ ప్రత్యర్థులు మాట్లాడే మాటలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తాయి ...ఎందుకు అంటే   మనం ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజా సేవ చేయాలనుకొంటున్నం  కాబట్టి మీ ప్రతీ చర్య ఆ రాజకీయ పార్టీ పై ఉంటుంది  కాబట్టి ఆ అభిమానుల కు సరి అయ్యిన సూచనలు ఇవ్వండి... చిరంజీవి గారు కొంతమంది సోషల్ మీడియాలో మీ కుటుంబం ను పొగుడుతూ... వ్యతిరేకులు తిడుతూ మీ కుటుంబ గౌరవంను రోడ్డుకు ఈడ్చటం, సొంత  దూషణలు చేయటం, ఈ సంస్కృతి ఇరువర్గాలకు మంచిది కాదు. ఎవ్వరి మధ్యో జరుగుతున్న దానికి మనం ఎందుకు సమ్మతించాలి. అనీ మనం వూరుకుంటే పోయేది మన పరువు కాబట్టి మీరు వెంటనే సహృద్భావంతో ఆలోచించి.. కత్తి మహేష్ ని పిలిచి మాట్లాడి ప్రజల లో మీ పట్ల గౌరవం పెంచుకొని ఈ సంక్రాంతి తో ఈ వ్యవహారానికి ముగింపు పలికి...చిరంజీవి.... చిరంజీవి.... గా మా గుండెల్లో ఉండాలి అని ,ఒక సామాన్యు పరిస్థితి నుంచి వచ్చిన చిరంజీవి ఇంత పెద్ద చిరంజీవి కుటుంబ సభ్యుల యొక్క కోరికను మన్నించుతారని మా కోరిక.

అని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటనలో చిరంజీవి ని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios