Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ ప్రేక్షకులకు చూపినట్టే తంబీలకూ చూపిస్తా-లక్ష్మీరాయ్

  • జూలీ 2 తో హిందీ,తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రాయ్ లక్ష్మీ
  • దసరాకే రావాల్సి వున్నా సెన్సార్ ఇబ్బందులతో వాయిదాపడ్డ జూలీ2
  • సెన్సార్ బోర్డు పుణ్యాన తమిళులకు అందాల విందు ఖాయమంటున్న రాయ్ లక్ష్మీ
lakshmi rai clarifies to tamil fans on julie 2 censor cuts

దసరా సీజన్ లోనే రిలీజ్ కావాల్సిన లక్ష్మీ రాయ్ జూలీ 2 సినిమా సెన్సార్ బోర్డుతో వచ్చిన సమస్యల కారణంగా రిలీజ్ ఆలస్యమైపోయింది. త్వరలోనే సమస్యలన్నీ తొలగి రిలీజ్ కాబోతున్న జూలీ2 ఈసారి అన్నీ సెన్సార్ కట్స్ వుంటాయనుకుంటున్నా వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తుందట.

 

అంటే ఇప్పుడు లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా వస్తున్న జూలీ సినిమాపై తమిళనాట ప్రేక్షకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జూలీ-2 తమిళ వెర్షన్ లో హాట్ హాట్ సీన్లు చాలా లేపేశారనే వార్తలు కోలీవుడ్ లో గుప్పుమన్నాయి. దీనిపై స్వయంగా లక్ష్మీ రాయ్ స్పందించింది.  తన అందాలు చూపిస్తారో లేదో అనే భయమేం అవసరం లేదనీ.. జూలీ 2 లో తన అందాలని కట్స్ లేకుండా చూడవచ్చనీ స్వయంగా తెలిపింది.

 

జూలీ-2 సినిమాకు సంబంధించి హిందీ, తమిళ వెర్షన్లకు సెన్సార్ విషయంలో ఎలాంటి తేడాలు లేవంటోంది లక్ష్మీరాయ్. తను నటించిన కొన్ని హాట్ సన్నివేశాలను బాలీవుడ్ ప్రేక్షకులకు ఎంత వరకు చూపిస్తారో అంతే మొత్తంలో తమిళ ప్రేక్షకులకు కూడా చూపిస్తామని చెబుతోంది. తాను బోల్డ్ గా నటించిన ఎన్నో సన్నివేశాలు సెన్సార్ బోర్డు సభ్యులకు కూడా నచ్చాయంటోంది లక్ష్మీ రాయ్.

 

బోల్డ్ అనగానే అవేదో అసభ్య సన్నివేశాలు అనుకుంటున్నారని.. కానీ ఆ సన్నివేశాల వెనకున్న సారాంశాన్ని అర్థంచేసుకోవాలని ఇంటర్వ్యూల్లో చెబుతోంది. ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ చేయడం, తర్వాత అందులో కళాత్మకతను చూడాలని చెప్పటం తన సినిమానీ ఆ కళాఖండాల స్థానం లో చేర్చి మరీ చెప్పటం కాస్త ఓవర్ గా అనిపిస్తున్నా తన యాంగిల్ లో కరెక్ట్ గానే వున్నానంటోంది.

Follow Us:
Download App:
  • android
  • ios