ఇవాంకా ముందు మంచు లక్ష్మి స్పీచ్

lakshmi manchu to speak in front of ivanka trump
Highlights

  • తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మంచు లక్ష్మి
  • గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సదస్సులో పాల్గొననున్న మంచు లక్ష్మి
  • ఇవాంకా ట్రంప్ ముందు ప్రసంగించే అవకాశం

హైదరాబాద్ లో జరుగుతున్న ద్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమిట్ లో నటి మంచు లక్ష్మీకి ఓ అరుదైన అవకాశం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్‌తో కలిసి ఓ సమావేశంలో పాల్గొనే అవకాశం మంచు లక్ష్మీని వరించినట్టు సమాచారం.హెచ్ఐసీసీలో జరగనున్న ఈ సదస్సులో ఓ ప్యానెల్ మీటింగ్‌కి హాజరయ్యే భారత ప్రతినిధుల బృందంలో మంచు లక్ష్మీ పేరుని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సదస్సులో భాగంగా ఇవాంక ట్రంప్ సమక్షంలో.. జరిగే ఓ సమావేశానికి హాజరై సమావేశంలోని ప్రతినిథులను ఉద్దేశించి ప్రసంగించే గొప్ప అవకాశం ఆమె సొంతమైందని తెలుస్తోంది.

 

అయితే లక్ష్మీ మంచు ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా షేర్ చేసుకోక పోవడంతో ఇందులో ఎంత నిజం వుందనే అంశంపై స్పష్టత రావాల్సి వుంది.

loader