`బేబీ` రీమేక్‌లో ఖుషి కపూర్?.. `అర్జున్ రెడ్డి` రీమేక్‌ని టార్గెట్ చేసిన మేకర్స్..
తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన `బేబీ` సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ చెల్లి పేరు వినిపిస్తుంది. మరి నిజం ఏంటంటే..
తెలుగులో కల్ట్ మూవీగా నిలిచింది `బేబీ`. బోల్డ్ కంటెంట్‌తో, ట్రెండీ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఈమూవీ అనూహ్య విజయం సాధించింది. దాదాపు వందకోట్లు వసూలు చేసింది. దీంతో `బేబీ`ని రీమేక్ చేస్తున్నారు. హిందీలో, తమిళంలో రీమేక్ చేస్తున్నట్టు ఇటీవలే నిర్మాత ఎస్‌కేఎన్ ప్రకటించారు. మాతృక దర్శకుడు సాయి రాజేషే అక్కడ కూడా దర్శకత్వం వహిస్తారని తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర టైటిల్ వినిపిస్తుంది. `కల్ట్ బొమ్మా` అనే టైటిల్‌ని పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ టైటిల్‌ని ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్టు చెప్పారు. హిందీలో స్టార్ కిడ్స్ తోగానీ, కొత్త వాళ్లతో `బేబీ` రీమేక్ చేయాలనుకుంటున్నాం. `అర్జున్ రెడ్డి` ఇక్కడి కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్స్ చేసింది. `బేబి` కూడా బాలీవుడ్ లో ఆ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. సందీప్ వంగాలో ఉన్న అగ్రెసివ్ నెస్ సాయి రాజేశ్ లో కూడా ఉంది` అని తెలిపారు ఎస్‌కేఎన్.
బాలీవుడ్ రీమేక్‌లో ఇంట్రెస్టింగ్ నేమ్స్ వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ పేరు కూడా వినిపిస్తుందట. ఆమెని టీమ్ కన్సిడర్ చేస్తుందని సమాచారం. దీంతోపాటు ఓ స్టార్ హీరో కొడుకుని హీరోగా లాంఛ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఇలా స్టార్ కిడ్స్ తో వెళ్లాలా? కొంత నోటెడ్ ఉన్న వాళ్లతో చేయాలా? లేదంటే యూట్యూబ్‌లో పాపులర్ అయిన వాళ్లతో చేయాలా? అనేది ఆలోచిస్తున్నట్టు తెలిపారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. కానీ ఖుషి కపూర్ పేరు బలంగా వినిపించడం విశేషం.
ఇదిలా ఉంటే ఎస్‌ఎకేఎన్, దర్శకుడు మారుతి టీమ్ కలిసి తమ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై తమిళంలో రూపొందిన `ట్రూ లవర్` మూవీని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ నెల 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ మూవీ గురించి చెబుతూ, యూత్ లవ్ స్టోరీ ఇది అని, నేటి తరం స్టూడెంట్స్, జాబర్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని, చాలా ట్రెండీగా ఉంటుందని, అందుకే ఈ మూవీ రైట్స్ తీసుకున్నట్టు తెలిపారు. `ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది. ఉండాలి. "ట్రూ లవర్" సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. అవి చూసే సినిమా సక్సెస్ ను బిలీవ్ చేశా` అన్నారు.
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన తమిళ మూవీ లవర్ ను `ట్రూ లవర్` పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ మూవీ తమిళంలో ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఒక్క రోజు గ్యాప్‌తో తెలుగులో విడుదల కానుంది.
Read more: పవన్ కళ్యాణ్ సినిమాకి కొత్త తిప్పలు.. ఫ్యాన్స్ లో ఆందోళన?
Also read: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మళ్లీ వస్తున్నాడు.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్.. డేట్ ఎప్పుడంటే?