Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ కళ్యాణ్‌ సినిమాకి కొత్త తిప్పలు.. ఫ్యాన్స్ లో ఆందోళన?

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `ఓజీ` మూవీ రిలీజ్‌ డేట్‌ ఇచ్చారు. కానీ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` పరిస్థితేంటనేది సస్పెన్స్ గా మారింది. దీనికితోడు ఆ వార్త ఇప్పుడు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది.

pawan kalyan fans worry about ustaad bhagat singh what happned ? arj
Author
First Published Feb 6, 2024, 6:14 PM IST | Last Updated Feb 6, 2024, 6:14 PM IST

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఏపీలో ఎన్నికల వరకు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `హరిహర వీరమల్లు` చిత్రాలున్నాయి. దీంతోపాటు కొత్తగా త్రివిక్రమ్‌ సినిమాకి కూడా ఓకే చెప్పారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఆయన పాలిటిక్స్ నుంచి ఎప్పుడు ఫ్రీ అవుతాడు, ఎప్పుడు షూటింగ్‌ల్లో పాల్గొంటారో అనేది అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా `ఓజీ` మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ మూవీ ఇప్పటికే 70శాతం షూటింగ్‌ పూర్తయ్యిందట. ఓ పదిహేను రోజులు పవన్‌ పాల్గొంటే షూటింగ్‌ అంతా పూర్తవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ చేసి రిలీజ్‌ చేయడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ డేట్‌ని ఇచ్చారు. ఆ లోపు షూటింగ్‌ కంప్లీట్ చేయోచ్చనేది ఆయన ఆలోచన. అది ఎంత వరకు అవుతుందో చూడాలి. 

ఇదిలా ఉంటే హరీష్‌ శంకర్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా చేస్తున్నాడు పవన్‌ కళ్యాణ్‌. ఈ మూవీ తమిళంలో వచ్చిన `తెరి` రీమేక్‌ అనే ప్రచారం జరిగింది. దీనిపై టీమ్‌ కూడా ఖండించలేదు. కానీ మెయిన్‌ ఫ్లాట్‌ మాత్రం అదే అని సమాచారం. అయితే ఇప్పుడు ఇదే మూవీని హిందీలోనూ రీమేక్‌ చేస్తున్నారు. `బేబీ జాన్‌` పేరుతో రీమేక్‌ జరుగుతుంది. మాతృక దర్శకుడు అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ ధావన్‌, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్నారు. ఏ కాళీశ్వరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ కూడా ఇచ్చారు. మే 31న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. 

`థెరీ`ని తెలుగులో కూడా చాలా మంది చూశారు. మరోవైపు హిందీలోనూ రాబోతుంది. దీంతో ఈ మూవీపై ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. రాను రాను హైప్‌ పోతుంది. అది సినిమాపై పెద్ద ప్రభావం పడుతుంది. బిజినెస్‌ పరమైన ఇబ్బందులు వస్తాయి. ఇదే ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను ఆలోచనలో పడేసింది. పవన్‌ పాలిటిక్స్ నుంచి కమ్‌ అయిన తర్వాత మొదట `ఓజీ` చేస్తారు. ఆ తర్వాతనే `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సెట్‌లోకి వస్తాడు. అది జరగడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుంది. 

మరోవైపు దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఇప్పటికే ఈ మూవీని పక్కన పెట్టి రవితేజతో సినిమా చేస్తున్నారు. `మిస్టర్‌ బచ్చన్‌` షూటింగ్‌లో ఉన్నారు. ఇది హిందీలో హిట్‌ అయిన `రైడ్‌`కి రీమేక్‌. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇది కూడా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`పై హైప్‌ తగ్గేలా చేస్తుంది. ఇవన్నీంటి మధ్య ఈ మూవీ కంప్లీట్‌ కావడం, రిలీజ్‌ కావడం పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. అదే పవన్‌ ఫ్యాన్స్ ని కాస్త డిజప్పాయింట్‌ చేస్తుందని చెప్పొచ్చు. ఈమూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios