Asianet News TeluguAsianet News Telugu

కూకట్‌పల్లి కోర్ట్ లో సమంతకి ఊరట.. ఆ కామెంట్లు తొలగించాలని ఆదేశం..

ఈ మేరకు పలు యూట్యూబ్ చానెళ్లని హెచ్చరించింది. సమంతపై ప్రసారం చేసిన కామెంట్లని తొలగించాలని తెలిపింది. యూట్యూబ్‌ చానెళ్లలో పోస్ట్ చేసిన కంటెంట్‌ని తొలగించాలని వెల్లడించింది. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్ట్ ఇంజెక్షన్‌ ఆర్ధర్‌ని పాస్‌ చేసింది. 

kukatpally court final justice favor of samantha
Author
Hyderabad, First Published Oct 26, 2021, 6:09 PM IST

కూకట్‌ పల్లి కోర్ట్ లో సమంత(Samantha)కి ఊరట లభించింది. సమంత పలు యూట్యూబ్‌ చానెళ్లపై వేసిన కేసులో ఆమెకి అనుకూలంగా కోర్ట్ తీర్పునిచ్చింది. మంగళవారం సాయంత్రం కోర్ట్ samantha పిటిషన్‌ని విచారించి తీర్పునిచ్చింది. ఈ మేరకు పలు యూట్యూబ్ చానెళ్లని హెచ్చరించింది. సమంతపై ప్రసారం చేసిన కామెంట్లని తొలగించాలని తెలిపింది. యూట్యూబ్‌ చానెళ్లలో పోస్ట్ చేసిన కంటెంట్‌ని తొలగించాలని వెల్లడించింది. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్ట్ ఇంజెక్షన్‌ ఆర్డర్‌ని పాస్‌ చేసింది. 

సమంత.. భర్త నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకులు తీసుకుంటున్నట్టు విషయం తెలిసిందే. అక్టోబర్‌ 2న వీరిద్దరు విడిపోతున్నట్టు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. అయితే సమంత.. నాగచైతన్య విడిపోవడానికి కారణాల పేరుతో పలు యూట్యూబ్‌ చానెళ్లు అనేక రకాల వార్తలను ప్రసారం చేశాయి. సమంతకి తన వ్యక్తిగత స్టయిలీస్ట్ ప్రీతమ్‌ తో సంబంధం ఉన్నట్టు, అలాగే పిల్లలు కనేందుకు నిరాకరించిందని, సరోగసి ద్వారా పిల్లలు పొందేందుకు ప్రయత్నించినట్టు ఇలా పలు రకాల పూకార్లని వార్తలుగా ప్రసారం చేశాయి. అయితే దీనిపై మండిపడ్డ సమంత వాటిపై kukatpally court కి వెళ్లింది. 

also read: నా ప్రతిష్టని దెబ్బతీశారు, శాశ్వత నిషేధం విధించండి.. సమంత డిమాండ్, తీర్పు వాయిదా!

తనపై అసత్య ప్రచారాలు చేసి, తనకు పరువు నష్టం కలిగించిన సదరు యూట్యూబ్‌ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని, సుమన్‌ టీవీ, తెలుగుపాపులర్‌ టీవీ, టాప్‌ తెలుగు టీవీ వంటి యూట్యూబ్‌ చానెళ్లని నిషేధించాలని ఆమె తన లాయర్‌ ద్వారా కూకట్‌పల్లి కోర్ట్ లో పిటిషన్‌ దాఖాలు చేసింది. దీనిపై గత కొన్నిరోజులుగా విచారణ జరుగుతుంది. మంగళవారం తీర్పుని వెల్లడించింది కోర్టు. సమంతపై అసత్య ప్రచారానికి సంబంధించిన కంటెంట్‌ని తొలగించాలని వెల్లడించింది. అలాగే సీ.ఎల్‌ వెంకట్రావు సైతం తన కంటెంట్‌ని తొలగించాలని తెలిపింది. ఇకపై ఎవరూ సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి అసత్య పోస్ట్ లు పెట్టరాదని తెలిపింది. తన వ్యక్తిగత విషయాలను సోషల్‌ మీడియాలో సమంత పోస్ట్ చేయొద్దని కోర్ట్ తెలిపింది. సమంత తరఫున బాలాజీ వడేరా కోర్ట్ లో వాదనలు వినిపించారు.

related news: Samantha Naga Chaitanya Divorce: సమంత కఠిన నిర్ణయం వెనుక కారణం... అందుకే వెనక్కి తగ్గడం లేదా!
 

Follow Us:
Download App:
  • android
  • ios