నా ప్రతిష్టని దెబ్బతీశారు, శాశ్వత నిషేధం విధించండి.. సమంత డిమాండ్, తీర్పు వాయిదా!
సమంత పిటిషన్ పై కొన్ని రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నేడు మరోసారి సమంత లాయర్ కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్నో విమర్శలు, నిందలు ఎదుర్కొంటోంది. వీరిద్దరి మధ్య విడాకులకు కారణాలుగా చెబుతూ కొందరు సోషల్ మీడియాలో సమంతపై అసత్య ప్రచారం మొదలు పెట్టారు. యూట్యూబ్ ఛానల్స్ అయితే సమంత వ్యక్తిగత జీవితంపై డిబేట్లు నడిపాయి. సమంతని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి.
యూట్యూబ్ ఛానల్స్ తన పర్సనల్ లైఫ్ పై శృతి మించేలా కథనాలు వేశారు. దీనితో కూకట్ పల్లి కోర్టులో Samantha ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ అయిన సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టివి, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
సమంత పిటిషన్ పై కొన్ని రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నేడు మరోసారి సమంత లాయర్ కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. సమంత తరుపున ఆయన వాదిస్తూ పలు కీలక విషయాలు ప్రస్తావించారు. సదరు Youtube Channels ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం వల్ల సమంత ప్రతిష్టని దెబ్బతీసేలా ప్రవర్తించారన్నారు.
సమంతపై జరిపిన కథనాల లింకులు తొలగించాలని కోర్టుని కోరారు. ఇలాంటి అసత్యాలు రాయకుండా.. శాశ్వత నిషేధం విధిస్తూ ఆర్డర్ ఇవ్వాలని సమంత కోర్టుని కోరింది. న్యాయమూర్తి తీర్పుని రేపటికి వాయిదా వేశారు.
Also Read:హైబడ్జెట్ మూవీలో అకీరా నందన్ గెస్ట్ రోల్.. పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ ?
సమంతకు తన స్టైలిస్ట్ Preetham తో సంబంధం ఉన్నట్లు, పిల్లలు కనేందుకు నిరాకరించినట్లు, సరోగసి ద్వారా పిల్లలు పొందాలని ప్రయత్నించినట్లు అనేక పుకార్లు ఈ యూట్యూబ్ ఛానల్స్ లో వైరల్ అయ్యాయి. దీనితో సమంత తీవ్ర ఆగ్రహానికి గురవుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
విడాకుల తర్వాత సమంత తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో ఎక్కువగా తీర్థయాత్రలకు వెళుతోంది. ఇటీవల సమంత నార్త్ లో పలు ఆలయాలని సందర్శించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.