భరత్ అను నేను... హిట్‌తో టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సినీ ప్రముఖులే కాదు... రాజకీయ నేతలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా భరత్ అను నేనుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. విజన్ ఫర్ ఏ బెటర్ టుమారో పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హీరో మహేష్‌బాబు, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలతో మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేసి... తన ఆనందాన్ని అందరితో షేర్ చేసుకున్నారు.

మహేష్, కొరటాల తనకు సర్‌ప్రైజ్ ఇచ్చారని... వారిద్దరితో కలిసి ఇంటరాక్ట్ సెషన్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు కేటీఆర్. ప్రజా జీవితానికి దగ్గరగా ఉన్న ఈ సినిమాను తాను కూడా ఎంతో ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్‌కు మహేష్ కూడా రిప్లై ఇచ్చారు. సినిమా చూసి మీరు ఎంజాయ్ చేయడం ఆనందగా ఉందని... మా కార్యక్రమంలో భాగస్వామ్యులైనందుకు కృజ్ఞ‌తలు తెలిపారు.