Asianet News TeluguAsianet News Telugu

రామ్ సినిమాపై కేటీఆర్ కామెంట్!

తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్భం వచ్చిన ప్రతిసారీ సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంటారు. అలానే పలు సినిమా ఈవెంట్లకు కూడా హాజరవుతుంటారు. ప్రస్తుతం ఆయన ఎన్నికలతో బిజీగా ఉన్నప్పటికీ రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు

ktr comments on hello guru premakosame movie
Author
Hyderabad, First Published Oct 20, 2018, 1:38 PM IST

తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్భం వచ్చిన ప్రతిసారీ సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంటారు. అలానే పలు సినిమా ఈవెంట్లకు కూడా హాజరవుతుంటారు. ప్రస్తుతం ఆయన ఎన్నికలతో బిజీగా ఉన్నప్పటికీ రామ్ నటించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

''ఎన్నికలతో బిజీగా ఉన్న తరుణంలో పండగ వల్ల కాస్త విరామం దొరికి 'హలో గురు ప్రేమకోసమే' సినిమా చూసే అవకాశం వచ్చింది. ఇది పూర్తి కామెడీతో కూడిన కుటుంబ కథా చిత్రం. రామ్, ప్రకాష్ రాజ్, అనుపమ పరమేశ్వరన్ అధ్బుతంగా నటించారు'' అంటూ కితాబిచ్చారు.

దీనిపై స్పందించిన రామ్.. మంత్రికి ధన్యవాదాలు చెబుతూ మీ కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ కనిపించారు. 

ఇవి కూడా చదవండి.. 

'హలో గురు ప్రేమకోసమే' డే-2 షాకింగ్ కలెక్షన్స్!

'హలో గురు ప్రేమకోసమే' ఫస్ట్ డే కలెక్షన్స్!

రివ్యూ: హలో గురు ప్రేమకోసమే

ప్రీమియర్ షో టాక్: హలో గురు ప్రేమ కోసమే

మంచి టైమ్ రామ్.. ఇప్పుడైనా హిట్టందుకోవయ్యా?

'అరవింద సమేత'తో తన సినిమాను పోల్చుకున్న హీరో!

అమ్మాయిలు నన్ను చూసి కుళ్లుకుంటారు.. ఏమంటావ్ అనుపమ?

‘‘హలో గురు ప్రేమకోసమే‌‌‌’’లో రామ్ ఎనర్జిటిక్ లుక్ (ఫోటోలు)

Follow Us:
Download App:
  • android
  • ios