1నేనొక్కడినే చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కృతిసనన్ నాగచైతన్య దోచేయ్ లో మెరిసిన కృతి తెలుగులో రాణించలేకపోయిన కృతిసనన్
మళయాళ నటి భావన కిడ్నాప్ కేసు తర్వాత.. సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరిగింది. తనను లైగింకంగా వేధించారంటూ భావన పోలీసులకు కేసు పెట్టిన తర్వాత.. ఆ విషయంపై పలువురు స్పందించారు. తాము కూడా అలాంటి అనుభవం ఎదుర్కొన్న వాళ్లమే అంటూ.. తమ గోడు వెల్లబుచ్చుకున్నారు.
మరికొందరు.. హీరోయిన్లు అయితే.. సినిమాల్లో ఛాన్సులు రావాలంటే.. దర్శక, నిర్మాతలు అడిగే కోరికలు తీర్చాల్సిందేనని, లేకపోతే అసలు అవకాశాలు రాకుండా చేస్తారంటూ చెప్పి.. అందరికీ షాక్ ఇచ్చారు. మరికొందరేమో.. టాలెంట్ ఉంటే ఎవరికీ తలొగ్గాల్సిన పనిలేదు. అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. ఈ రెండు రకాల వర్షనలతో ఈ విషయంపై ఆ మధ్య చాలా కాలంపాటు చర్చలు సాగాయి.
ఇప్పుడు తాజాగా ఇలాంటి టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. మహేష్.. నేనొక్కడినే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన భామ కృతిసనన్. ఈ సినిమా హిట్ కాకపోవడంతో.. తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది. తర్వాత నాగ చైతన్య దోచేయ్ లో అవకాశం వచ్చినా.. పెద్దగా లాభం లేకుండా పోయింది.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న కృతి.. తనను ఎవరూ సినిమాల్లో అవకాశాల కోసం పడక గదికి రావాలని కోరలేదని, లైంగికంగా వేధించలేదని చెప్పింది. చాలా మంది ఈ విషయంపై చాలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. కానీ తనకు మాత్రం ఇప్పటి వరకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని కృతి చెబుతోంది.
