క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రతిష్టాత్మక చిత్రం నక్షత్రం ప్రధాన పాత్రల్లో సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ లో నక్షత్రం మూవీ టీజర్ విడుదల

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం నక్షత్రం. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకి సిద్ధమైంది. ఈ నెలలోనే మూవీని విడుదల చేయాలని టీం భావిస్తుండగా, తాజాగా సందీప్ బర్త్ డే శుభాకాంక్షలతో టీజర్ విడుదల చేశారు. ఇందులో ప్రతి ఫ్రేం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘నక్షత్రం’ సినిమా కృష్ణవంశీ మార్క్ సినిమా అనేలా ఉంటుందని టీజర్ ని బట్టే తెలుస్తుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.