Asianet News TeluguAsianet News Telugu

Krishnam Raju : కేంద్ర మంత్రిగానూ సేవ‌లందించిన కృష్ణం రాజు

తెలుగు సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు రాజకీయ నాయకుడిగానూ తన సేవలు అందించారు. వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 

Krishnam Raju who also served as Union Minister
Author
First Published Sep 11, 2022, 9:00 AM IST

తెలుగు సినీ న‌టుడు, టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయారు. సినిమా ప్ర‌పంచానికి తీర‌ని వేధ‌న‌ను మిగిలిచ్చారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు గ్రామంలో 1940లో కృష్ణం రాజు జ‌న్మించారు. త‌న 83వ ఏటా తెలుగు సినీ ప్ర‌పంచాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. 

#Krishnam Raju:కృష్ణం రాజుగారి మూడు తీరని కోరికలు...ప్రయత్నించారు కానీ ..!!

టాలీవుడ్ లో గొప్ప‌ న‌టుడిగా, రెబ‌ల్ స్టార్ గా కృష్టం రాజుకు మంచి పేరుంది. అయితే ఆయ‌న కేవ‌లం సినీ ఇండ‌స్ట్రీకే ప‌రిమితం కాలేదు. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న సేవ‌లందించారు. అందులోనూ చెర‌గ‌ని ముద్ర వేశారు. 1991 సంవ‌త్స‌రంలో ఆయ‌న యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొద‌ట ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి రాజ‌కీయ పాఠాలు నేర్చుకున్నారు. 

Rip Krishnam Raju: అబ్బాయి ప్రభాస్ తో నటించడం కృష్ణంరాజుకు మహాఇష్టం... కలిసి చేసిన చిత్రాలు ఇవే!

1998 ఎన్నికల స‌మ‌యంలో ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆ పార్ట నుంచే కాకినాడ లోక్ స‌భ స్థానం నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. అయితే ఏడాది త‌రువాత మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న నర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్ స‌భ కు ఎన్నిక‌య్యారు. అయితే అదే సంవ‌త్స‌రం కేంద్ర మంత్రి వ‌ర్గంలో చేరారు. ఆ స‌మ‌యంలో వాజ్ పేయ్ ప్ర‌ధానిగా ఉన్నారు.

స్నేహం కోసం నిలిచిన కృష్ణం రాజు.. చిరంజీవి జీవితంలో మరచిపోలేని సంఘటన

త‌రువాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కృష్ణం రాజు బీజేపీకి రాజీనామా చేశారు. సినీ న‌టుడు చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో 2009 సంవ‌త్స‌రంలో జాయిన్ అయ్యారు. ఆ స‌మ‌యంలో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి లోక్ స‌భ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో కృష్ణం రాజుకు ప‌రాజ‌యం ఎదురైంది. త‌రువాత మ‌ళ్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆయ‌న యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. కృష్ణం రాజు మృతి ప‌ట్ల ప్రముఖులు తీవ్ర సంతాపం ప్ర‌క‌టించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios