- Home
- Entertainment
- Rip Krishnam Raju: అబ్బాయి ప్రభాస్ తో నటించడం కృష్ణంరాజుకు మహాఇష్టం.. కానీ వెంటాడిన బ్యాడ్ సెంటిమెంట్
Rip Krishnam Raju: అబ్బాయి ప్రభాస్ తో నటించడం కృష్ణంరాజుకు మహాఇష్టం.. కానీ వెంటాడిన బ్యాడ్ సెంటిమెంట్
తన నట వారసుడు ప్రభాస్ తో కలిసి నటించడానికి కృష్ణం రాజు ఎంతగానో ఇష్టపడేవారు. మరి వీరి కాంబినేషన్స్ లో వచ్చిన చిత్రాలు ఏమిటో తెలుసా...

Rip Krishnam Raju
ఓ గొప్ప నటుడి శకం ముగిసింది. టాలీవుడ్ రెబల్ స్టార్ అనంతలోకాలకు వెళ్లిపోయారు. సినిమాలనే తీపి గుర్తులు అభిమానులకు వదిలి సుదూర తీరాలకు పయనం అయ్యారు. నటుడిగా, రాజకీయవేత్తగా, ఇండస్ట్రీ పెద్దగా పలు రంగాల్లో రాణించిన కృష్ణం రాజు... ప్రభాస్ వంటి గొప్ప నటవారసుడ్ని మనకిచ్చిపోయారు.
Rip Krishnam Raju
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పెదనాన్నను మించిన నటుడయ్యాడు. కృష్ణం రాజు గర్వపడే స్థాయికి చేరుకున్నారు. ఈశ్వర్ మూవీతో ప్రభాస్ ని కృష్ణం రాజు వెండితెరకు పరిచయం చేశారు. ఇక మల్టీ స్టారర్స్ చేయడంలో ఎప్పుడూ ముందుండే కృష్ణం రాజు కొడుకు ప్రభాస్ తో కూడా మూడు చిత్రాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా ఈ మూడు చిత్రాలు అభిమానుల మదిలో ప్రత్యేక స్థానం పొందాయి.
Rip Krishnam Raju
2009లో మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదలైన `బిల్లా` మూవీలో ప్రభాస్, కృష్ణంరాజు మొదటిసారి కలిసి నటించారు. ప్రభాస్ డాన్ గా, చిల్లర దొంగగా రెండు భిన్నమైన పాత్రలు చేశారు. డాన్ బిల్లాను వెంటాడే ఇంటర్ పోల్ ఆఫీసర్ రోల్ లో కృష్ణంరాజు కనిపించాడు. బిల్లా మూవీలో కృష్ణం రాజు పాత్ర ఫ్యాన్స్ కి ట్రీట్. ఆ మూవీ ప్రభాస్ కెరీర్ లో మోస్ట్ సూపర్ స్టైలిష్ మూవీగా నిలిచిపోయింది. డాన్ గా ప్రభాస్ మేనరిజం, స్టైల్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి.
Rip Krishnam Raju
బిల్లా విడుదలైన మూడేళ్లకు ప్రభాస్-కృష్ణంరాజు కాంబినేషన్ లో రెబల్ విడుదలైంది. 'మాస్' మూవీ హిట్ తో ఊపు మీదున్న లారెన్స్ ప్రభాస్ తో యాక్షన్ రివేంజ్ డ్రామా తెరకెక్కించారు. `రెబల్` మూవీలో కృష్ణంరాజు ప్రభాస్ తండ్రిగా కనిపించారు. మాఫియా లీడర్ గా కృష్ణం రాజు స్టైలిష్ లుక్ అబ్బురపరుస్తుంది. అలాగే లారెన్స్ హీరో ప్రభాస్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. తమన్నా హీరోయిన్ గా నటించింది.
Rip Krishnam Raju
ఇక కృష్ణంరాజు చివరి చిత్రం కూడా ప్రభాస్ తో కావడం యాదృచ్ఛికం. ఈ ఏడాది విడుదలైన రాధే శ్యామ్ మూవీలో కృష్ణంరాజు ఓ చిన్న పాత్ర చేశారు. ఆయన ప్రభాస్ గురువు... పరమహంస పాత్ర చేశారు. రాధే శ్యామ్ డిజాస్టర్ అయినప్పటికీ ఆయన చివరి చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారన్న అనుభూతి అభిమానులకు మిగిలింది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కృష్ణంరాజు హాజరయ్యారు. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో వీరిద్దరు కలిసి చేస్తే సినిమా పరాజయం అవుతుందనే ఓ అపోహ టాలీవుడ్‌లో వినిపిస్తుండటం విచారకరం.
ఇక కెరీర్ లో కృష్ణంరాజు అనేక మల్లీస్టారర్స్ చేశారు. బాలకృష్ణ, చిరంజీవి, సుమన్, నాగార్జున వంటి స్టార్స్ చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు. కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు విలన్ గా, సైడ్ హీరోగా చేశాడు. దశాబ్దాల పాటు సాగిన కెరీర్ లో అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. నేటితో ఆయన శకం ముగిసింది.